James Cameron: ‘అవతార్‌’ చాలిస్తున్న కామెరూన్‌

బ్లాక్‌బస్టర్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘అవతార్‌’కి ప్రాణం పోసిన ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ నాలుగు, ఐదో భాగాల దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మంగళవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..

Updated : 06 Jul 2022 12:10 IST

బ్లాక్‌బస్టర్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘అవతార్‌’కి(Avatar) ప్రాణం పోసిన ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌(James Cameron) నాలుగు, ఐదో భాగాల దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. మంగళవారం ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. రెండు, మూడు భాగాలు పూర్తైన తర్వాత ఇతర ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో భాగం ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’(Avatar 2) డిసెంబరులో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘నేను అమితాసక్తి చూపే ఓ కొత్త ప్రాజెక్టు కోసం పని చేయాలనుకుంటున్నా. దీనికోసం నా బాధ్యతల నుంచి తప్పుకొని నాలుగు, ఐదో భాగాల దర్శకత్వ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలనుకుంటున్నా’ అన్నారు. ‘అవతార్‌ నాకెంతో ఇష్టమైన వాతావరణం, ప్రకృతి, కుటుంబం.. అనే అంశాలపై నా అభిప్రాయం చెప్పడానికి గొంతునిచ్చింది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఇవి నాకెంతో ప్రత్యేకం’ అన్నారు. పదేళ్ల తర్వాత అవతార్‌ రెండో భాగం ఈ డిసెంబరులో విడుదలవుతోంది. ట్వంటీయత్‌ సెంచరీ స్టూడియో నిర్మిస్తోంది. శామ్‌ వర్తింగ్టన్‌, జో సల్దానా, సిగోర్నీ వీవర్‌, కేట్‌ విన్‌స్లెట్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు