Suma: ‘జయమ్మ పంచాయితీ’.. సరికొత్త ట్రైలర్‌ చూశారా..!

‘‘లేదులే వదినా.. గుండాలు తొక్కినా గండం గట్టెక్కినట్టే ఉంది. పిల్ల ఫంక్షన్‌ చేసి.. వచ్చిన చదివింపులతో మాయ్యకి ఆపరేషన్‌ చేయించేస్తను. పిల్ల పెద్దమనిసి అవడం, డాక్టర్‌ ఆపరేషన్‌ అనడం.. అదిగో...

Updated : 07 Dec 2022 16:44 IST

హైదరాబాద్‌: ‘‘లేదులే వదినా.. గుండాలు తొక్కినా గండం గట్టెక్కినట్టే ఉంది. పిల్ల ఫంక్షన్‌ చేసి.. వచ్చిన చదివింపులతో మాయ్యకి ఆపరేషన్‌ చేయించేస్తను. పిల్ల పెద్దమనిసి అవడం, డాక్టర్‌ ఆపరేషన్‌ అనడం.. అదిగో అంతా ఆ దేవుడి ప్లాన్‌లాగే ఉంది’’ అని అంటున్నారు నటి సుమ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. కుటుంబకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ‘జయమ్మ పంచాయితీ’ రిలీజ్‌ ట్రైలర్‌ను నటుడు మహేశ్‌బాబు విడుదల చేశారు. సుమతోపాటు చిత్రబృందం మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఆయన ఈ ట్రైలర్‌ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. గ్రామీణ మహిళగా ఉత్తరాంధ్ర యాసలో సుమ చెప్పే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రామంలోనే గడుసైన మహిళగా పేరున్న జయమ్మ ఉన్నట్టుండి పంచాయితీకి ఎందుకు వెళ్లింది? గుండె సమస్యతో బాధపడుతున్న తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఆమె ఏం చేసింది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ‘జయమ్మ పంచాయితీ’ రూపుదిద్దుకుంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందించారు. బలగా ప్రకాశ్‌ నిర్మాత.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని