జపనీస్‌ జిగేల్‌ రాణిని చూశారా!

‘జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌ జిగేలు రాణి’ అంటూ ఊరమాస్‌ స్టెప్పులు వేసి ప్రేక్షకులతో ఈలలు వేయించుకున్నారు నటుడు రామ్‌ చరణ్‌ నటి పూజా హెగ్డే. ‘రంగస్థలం’ చిత్రంలోని ఈ పాటకు ప్రతి వయసువారు బాగా కనెక్ట్‌ అయ్యారు.....

Published : 02 Jul 2021 01:21 IST

చెర్రీ పాటకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ డ్యాన్స్‌

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌ జిగేలు రాణి’ అంటూ ఊరమాస్‌ స్టెప్పులు వేసి ప్రేక్షకులతో ఈలలు వేయించుకున్నారు నటుడు రామ్‌ చరణ్‌, నటి పూజా హెగ్డే. ‘రంగస్థలం’ చిత్రంలోని ఈ పాటకు ఫ్యాన్స్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. దీంతో ఇప్పటికీ పలువురు నెటిజన్లు ఈ పాటకు కవర్‌సాంగ్స్‌ చేస్తున్నారు. తాజాగా జపాన్‌కు చెందిన ఓ జంట ‘జిగేలు రాణి’ పాటకు డ్యాన్స్ చేసి అందర్నీ ఆకర్షించింది. ఇంతకీ ఆ జంట మరెవరో కాదు.. హీరోమునిరు, అతని సోదరి అశాహి ససాకీ.

ఎన్టీఆర్‌కు వీరాభిమానులైన ఈ అన్నాచెల్లిళ్లు.. తారక్‌ పాటలతో కవర్‌సాంగ్స్‌ క్రియేట్‌ చేసి ఇప్పటికే పలుమార్లు ఇంటర్నెట్‌ని షేక్‌ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరూ రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమాలోని పాటకు కవర్‌సాంగ్‌ చేశారు. సినిమాలో రామ్‌చరణ్‌, పూజాహెగ్డే ఎలాంటి స్టెప్పులైతే వేశారో వాటినే అనుకరించింది ఈ జోడీ. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. వీళ్ల ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. తారక్‌ అంటే తమకెంతో ఇష్టమని.. ఆయన నటించిన ప్రతి చిత్రాన్ని చూస్తుంటామని.. సోషల్‌మీడియాలో ఫేమ్‌ పొందేందుకే ఎన్టీఆర్‌ పాటలకు కవర్‌సాంగ్స్‌ క్రియేట్‌ చేస్తున్నామని ఓ సందర్భంలో ఈ జోడీ తెలిపింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని