Bollywood: శ్రీకాంత్‌ బొల్లా జీవిత కథలో ఈ ఇద్దరూ!

దివ్యాంగ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీకాంత్‌ పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ నటిస్తున్నాడు.

Updated : 19 Nov 2022 06:53 IST

దివ్యాంగ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్‌ బొల్లా (Srikanth Bolla) జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీకాంత్‌ పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ నటిస్తున్నాడు. ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ తర్వాత తుషార్‌ హీరానందానీ దర్శకత్వం వహించనున్న చిత్రమిది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటి జ్యోతికతోపాటు (Jyothika) యువ కథానాయిక ఆల్యా ఎఫ్‌ (Alaya F) నటించనున్నట్టు  తెలుస్తోంది. ఈ ఇద్దరి పాత్రలు చిత్రంలో కీలకంగా నిలవనున్నాయట. ఈ నెలాఖరున సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు భూషణ్‌కుమార్‌, నిధి పర్మార్‌. శ్రీకాంత్‌ బొల్లా స్ఫూర్తిదాయక జీవితాన్ని ఇందులో చూపించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని