Kannappa: మంచు విష్ణు బర్త్‌డే స్పెషల్‌.. ఆకట్టుకుంటున్న ‘కన్నప్ప’ ఫస్ట్‌లుక్‌..

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు పుట్టినరోజు సందర్భంగా దీని ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Updated : 23 Nov 2023 11:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమవుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). భారీ తారాగణంతో ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు విష్ణు పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్‌ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘యానిమల్‌’ రన్‌ టైమ్‌ ఇదే..! ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద సినిమా!

హీరో ముఖం కనిపించకుండా శివలింగం వైపు ఓ యోధుడు విల్లు ఎక్కుపెట్టినట్లు ఈ పోస్టర్‌లో చూపించారు. దీన్ని షేర్‌ చేసిన మంచు విష్ణు ‘కన్నప్ప’ ప్రపంచంలోకి అడుగుపెట్టండి అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఒక నాస్తికుడైన యోధుడు శివుడికి పరమభక్తుడిగా ఎలా మారాడన్నది ఈ చిత్రంలో చూపించనున్నట్లు ఆయన తెలిపారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా పోస్టర్‌ను ఆరు భాషల్లో విడుదల చేశారు. విష్ణు ప్రధానపాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ శివుడిగా, నయనతార పార్వతిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే స్టార్‌ హీరోలు శివరాజ్‌కుమార్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, మోహన్‌బాబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌లు పనిచేయనున్నారు. ఇక న్యూజిల్యాండ్‌లో ఒకే షెడ్యూల్‌లో ‘కన్నప్ప’ చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఇటీవలే దీని షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని