kaathal the core: మలయాళ బ్లాక్‌బస్టర్‌.. ఇప్పుడు ఓటీటీలో..!

మమ్ముట్టి (Mammootty), జ్యోతిక (Jyothika) కీలక పాత్రల్లో నటించిన ‘కాదల్‌ - ది కోర్‌’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Updated : 08 Jan 2024 15:41 IST

హైదరాబాద్: మమ్ముట్టి (Mammootty), జ్యోతిక (Jyothika) కీలక పాత్రల్లో జో బేబీ దర్శకత్వంలో రూపొందిన ఎమోషనల్‌ డ్రామా ‘కాదల్‌ - ది కోర్‌’ (Kaathal - The Core). నవంబరు 23న మలయాళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా?అని ఎదురు చూస్తున్న సినీ అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ శుభవార్త చెప్పింది. అయితే, ఇక్కడే చిన్న మెలిక పెట్టింది. మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమాను ప్రస్తుతం ఓవర్సీస్‌ యూజర్లు వీక్షించే అవకాశం కల్పించింది. అది కూడా అద్దె ప్రాతిపదికన. 2.99 డాలర్లు చెల్లించి ఈ సినిమాను వీక్షించాల్సి ఉంటుంది.

మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్‌కు తీసుకురావడంతో ఓటీటీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, భారత్‌లో ఉన్న ప్రైమ్‌ చందాదారులకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తామనే దానిపై అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నుంచి ఎలాంటి ప్రకటనా లేదు. వీలైనంత త్వరగా స్ట్రీమింగ్‌కు తెచ్చే అవకాశం ఉందని టాక్‌. అది అద్దె రూపంలో తీసుకొస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ‘కాదల్‌ - ది కోర్‌’ను (kaathal the core ott release) విడుదలకు ముందే వివాదాలు చుట్టుముట్టాయి. హోమో-సెక్సువాలిటీని ప్రోత్సహించేలా సినిమా ఉందంటూ కువైట్‌, ఖతార్‌ దేశాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి. అయితే, వాటన్నింటినీ తట్టుకుని, మలయాళ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.

ఇంతకీ కథేంటంటే: విశ్రాంత బ్యాంకు మేనేజర్‌ అయిన మాథ్యూ దేవస్సే (మమ్ముట్టి) స్థానిక పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో అతని భార్య ఓమన (జ్యోతిక) మాథ్యూ నుంచి విడాకులు కోరుతుంది. అతడు ‘గే’ అంటూ ఆరోపణలు చేస్తుంది. భార్య చర్యతో ఊహించని షాక్‌ తిన్న మాథ్యూ ఏం చేశాడు? ఎన్నికల్లో పోటీ చేశాడా? లేదా? భార్య చేసిన పని వల్ల అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని