Kajal: కాత్యాయని వచ్చేసింది

నందమూరి బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి కలయికలో తెరకెక్కిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.

Updated : 08 Oct 2023 13:47 IST

నందమూరి బాలకృష్ణ - అనిల్‌ రావిపూడి కలయికలో తెరకెక్కిన యాక్షన్‌ చిత్రం ‘భగవంత్‌ కేసరి’. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించిన సంగతి తెలిసిందే. ఆమె కాత్యాయని అనే పాత్రలో కనిపించనుందని తెలియజేస్తూ చిత్ర బృందం శనివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. అంతేకాదు అర్జున్‌ రాంపాల్‌ ఇందులో రాహుల్‌ సంఘ్వీ అనే ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర ట్రైలర్‌ ఆదివారం విడుదల కానుండగా.. సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 19న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని