Kareena Kapoor: ‘సింగమ్‌ అగైన్‌’ సెట్లో కరీనా

‘జానే జాన్‌’లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కరీనా కపూర్‌ ఇప్పుడు మరో సరికొత్త పాత్రతో కనువిందు చేయడానికి ముస్తాబవుతోంది.

Updated : 25 Sep 2023 14:07 IST

‘జానే జాన్‌’లో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కరీనా కపూర్‌ ఇప్పుడు మరో సరికొత్త పాత్రతో కనువిందు చేయడానికి ముస్తాబవుతోంది. ఈమధ్యే చిత్రీకరణ మొదలైన ‘సింగమ్‌ అగైన్‌’లో తనూ తాజాగా పాల్గొంటున్నట్టు చిత్రబృందం తెలిపింది. రోహిత్‌శెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌, అక్షయ్‌కుమార్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు ప్రధాన పాత్రధారులు. దీపిక పదుకొణె, టైగర్‌ ష్రాఫ్‌లు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘సింగమ్‌ అగైన్‌’ చిత్రీకరణలో కరీనా భాగం కానున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా కరీనా, అజయ్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తొమ్మిదేళ్ల తరవాత మరోసారి అజయ్‌తో కలిసి నటించడానికి కరీనా ఉత్సాహంగా ఉన్నారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని