Keerthy Suresh: అలాంటప్పుడు ఆలోచించడమెందుకు!

కీర్తి సురేశ్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. దసరా, మామన్నన్‌ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు చూపించింది.

Updated : 03 Dec 2023 07:17 IST

కీర్తి సురేశ్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. దసరా, మామన్నన్‌ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు చూపించింది. అయితే ఈ విజయాల ప్రభావం వల్ల స్క్రిప్ట్‌ ఎంపికలో ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయా? అని ప్రశ్నిస్తే.. తనదైన శైలిలో కీర్తి జవాబిచ్చింది. ఒక హిట్టు పడిందనో, ఫ్లాప్‌ వచ్చిందనో అప్పటికప్పుడు స్క్రిప్ట్‌ ఎంపికలో మన ఆలోచనా విధానం మారిపోదు. నిజానికి నేనెప్పుడూ ఎంతో భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు చేయాలనుకుంటా. వైవిధ్యభరితమైన పోషించాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం. కానీ, నా దగ్గరకొస్తున్న కథలు, పాత్రలన్నీ నా ఊహలు, కలలకు మించినవై ఉంటున్నప్పుడు మళ్లీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది. ఆ ప్రయాణాన్ని ఎంత బాగా ఆస్వాదించాలన్న దానిపై దృష్టి పెడితే సరిపోతుంద్ఠ్ఠి అని కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం సైరెన్, రఘు తాత, రివాల్వర్‌ రీటా, కన్నివేడి సినిమాలతో సెట్స్‌పై బిజీగా ఉంది. అలాగే రాధికా ఆప్టేతో కలిసి ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని