Sebastian pc524 Review: రివ్యూ: సెబాస్టియన్ పీసీ 524
కిరణ్ అబ్బవరం నటించిన సెబాస్టియన్ సినిమా ఎలా ఉందంటే..?
చిత్రం: సెబాస్టియన్ పీసీ524; నటీనటులు: కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా తదితరులు; సంగీతం: జిబ్రాన్; ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి; దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి; నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్, రాజు; విడుదల తేదీ: 04-03-2022
‘రాజావారు రాణీగారు’, ‘ఎస్.ఆర్.కల్యాణ మండపం’ సినిమాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడాయన నుంచి వచ్చిన మూడో చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. బాలాజీ సయ్యపురెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో కిరణ్ రేచీకటి సమస్య ఉన్న కానిస్టేబుల్‌గా నటించడం.. ప్రచార చిత్రాలు వినోదాత్మకంగా ఉండటంతో సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి అంచనాలను సెబాస్టియన్ అందుకున్నాడా? అసలతని కథేంటి? రేచీకటి సమస్యతో అతను పడిన పాట్లేంటి? తెలుసుకుందాం పదండి..
కథేంటంటే: మదనపల్లి నేపథ్యంలో సాగే.. సెబాస్టియన్ అనే ఓ రేచీకటి కానిస్టేబుల్ కథ ఇది. తనకు రేచీకటి ఉందన్న నిజాన్ని దాచి పెట్టి ఉద్యోగం సంపాదిస్తాడు సెబా. తన చుట్టూ ఉన్న వాళ్లని మేనేజ్ చేస్తున్నట్లుగానే.. ఏదోలా ఉద్యోగాన్ని కూడా మేనేజ్ చేసేద్దాం అనుకుంటాడు. ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా కొన్ని రోజులు బాగానే సాగిపోతుంది. కానీ, తనకున్న సమస్య వల్ల ఓరోజు ఆపదలో ఉన్న నీలిమ(కోమలీ ప్రసాద్) అనే మహిళను కాపాడలేకపోతాడు. అంతేకాదు ఆ హత్య కేసును విచారించే క్రమంలో చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఆ హత్యకు సంబంధించిన ఆధారాలు మిస్సవుతాయి. ఫలితంగా అతను సస్పెండ్ అవుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ‘ఉద్యోగం గొప్పదా.. న్యాయం గొప్పదా’ అనే ప్రశ్న తలెత్తినప్పుడు హీరో ఏం చేశాడు? కోమలి హత్య ఛేదించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? అసలు ఆమెను హత్య చేసిందెవరు? ఈ కేసుకు సెబా ప్రేయసి హేలి (నువేక్ష)కి ఉన్న లింకేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా సాగిందంటే: రేచీకటి సమస్య ఉన్న ఓ కానిస్టేబుల్.. తనకున్న సమస్య వల్ల ఆపదలో ఉన్న ఓ మహిళను కాపాడలేకపోవడం.. ఈ క్రమంలో జరిగిన మరో పొరపాటు వల్ల ఆ హత్య కేసుకు సంబంధించిన ఆధారాలు చెరిగిపోవడం.. ఇలా లైన్‌గా చూస్తున్నప్పుడు ఓ ఆసక్తికర క్రైమ్ థ్రిల్లర్‌కు కావాల్సిన ముడిసరకంతా సెబాస్టియన్లో ఉన్నట్లే కనిపిస్తుంది. పైగా హీరోకున్న లోపం నుంచి కావాల్సినంత వినోదం పిండుకునే అవకాశం కూడా ఉంది. ప్రచార చిత్రాలు చూస్తున్నప్పుడు దర్శకుడు వీటిని సరైన రీతిలోనే మేళవించి, తెరపై ఆవిష్కరించినట్లు అనిపించింది. కానీ, ప్రచార చిత్రాల్లో కనిపించిన థ్రిల్లింగ్ మూమెంట్స్ వెండితెరపై ఎక్కడా కనిపించలేదు. కోమలీ నేపథ్యం నుంచి సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. రేచీకటి లోపం వల్ల సెబాస్టియన్ నైట్ డ్యూటీలో పడే ఇబ్బందులు నవ్వులు పూయిస్తాయి. ఆరంభంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత సాగే కథనం కాస్త సహనానికి పరీక్షలా ఉంటుంది. సెబా మదనపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యాకే మళ్లీ కథలో కాస్త వేగం పెరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఓరోజు అతను పోలీస్ స్టేషన్లో నైట్ డ్యూటీ చేయాల్సి రావడం.. అదే రోజు రాత్రి కోమలీ హత్యకు గురవడంతో సినిమా ఒక్కసారిగా థ్రిల్లర్ జానర్లోకి టర్న్ తీసుకుంటుంది. అయితే ఆ తర్వాత నుంచి మరింత ఆసక్తికరంగా సాగుతుందనుకున్న కథనం.. పూర్తిగా గాడి తప్పుతుంది. ఆ కేసును ఛేదించే క్రమంలో సెబా చేసే ప్రయత్నాలేవీ ఆసక్తికరంగా ఉండవు. సరిగ్గా విరామ సమయానికి ఈ కేసుతో తన ప్రేయసికి, మిత్రుడికి, కోమలీ మామకు సంబంధం ఉందని సెబాస్టియన్ కనిపెట్టడంతో ద్వితీయార్ధంపై ఆసక్తి పెరుగుతుంది.
కానీ, ద్వితీయార్ధం ఆరంభంలోనే సరైన ఆధారాలు లేని కారణంగా కోర్టు ఆ కేసును కొట్టేయడం.. కోమలీ కుటుంబ సభ్యులు కూడా ఆ కేసును చాలా లైట్‌గా తీసుకోవడంతో కథనం ఏమాత్రం ఆసక్తికరంగా ముందుకు సాగదు. పైగా కోర్టు కొట్టేసిన.. ఎవరూ పట్టించుకోని ఈ కేసు కోసం సెబాస్టియన్ దేవదాస్‌లా మారిపోవడమన్నది చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ఆఖరి పది నిమిషాల్లో కేసును చకచకా ఓ కొలిక్కి తీసుకొచ్చి సినిమాని ముగించిన తీరు ప్రేక్షకులకు ఏమాత్రం రుచించదు.
ఎవరెలా చేశారంటే: సెబాస్టియన్ పాత్రకు కిరణ్ తనవంతు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. రేచీకటి లోపంతో ఇబ్బందిపడే కానిస్టేబుల్‌గా అతడి నటన మెప్పిస్తుంది. ఆ పాత్ర తర్వాత సినిమాలో కాస్త ఎక్కువ మార్కులు పడింది ఎస్సైగా చేసిన శ్రీకాంత్ అయ్యంగార్‌కే. సినిమాలో నాయికలిద్దరి పాత్రలు పూర్తిగా తేలిపోయాయి. బాలాజీ ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా అనిపిస్తుంది. జిబ్రాన్ సినిమాకి తన సంగీతంతో ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. వాటిని చిత్రీకరించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. రాజ్ కె.నల్లి ఛాయాగ్రహణం ఫర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
బలాలు:
+ కథా నేపథ్యం
+ కిరణ్ నటన
+ పాటలు, నేపథ్య సంగీతం
బలహీనతలు:
- కథనం
- ప్రథమార్ధం
చివరిగా: నిరుత్సాహపరిచే సెబాస్టియన్..!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
baak movie review: ‘అరణ్మనై’ సిరీస్‌లో నాలుగో భాగంగా వచ్చిన ‘బాక్’మూవీ సినీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
aa okkati adakku review: అల్లరి నరేష్, ఫరియా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా. -
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
sabari movie review in telugu: వరలక్ష్మీ శరత్‌కుమార్, గణేశ్ వెంట్రామన్ కీలక పాత్రల్లో నటించిన ‘శబరి’ మెప్పించిందా? -
రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
సుహాస్ కీలక పాత్రలో ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్‌తో రూపొందిన థ్రిల్లర్ మూవీ ఎలా ఉంది. -
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?
తాజా వార్తలు (Latest News)
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్‌పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!