Kriti Sanon: అతడితో డ్యాన్స్‌ చేయడానికి భయపడ్డా: కృతి సనన్‌

ఓ హీరోతో డ్యాన్స్‌ చేయడానికి భయపడ్డాడనని కృతి సనన్‌ చెప్పారు. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా కృతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

Published : 01 Feb 2024 16:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ నేపథ్యం లేకపోయినా కృతి సనన్‌ (Kriti Sanon) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. తాజాగా షాహిద్ కపూర్‌ (Shahid Kapoor) సరసన ‘తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా’లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘‘ఏ హీరోతోనైనా మొదటిసారి డ్యాన్స్‌ చేయాలంటే భయపడతాను. షాహిద్ కపూర్‌ అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తారు. ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన డ్యాన్సర్‌లలో అతడు ఒకరు. అతడి వేగానికి మ్యాచ్‌ అయ్యేలా డ్యాన్స్‌ వేయాలంటే భయమేసింది. కానీ జాగ్రత్తగా చేసేశా. ఈ సినిమా షూటింగ్ సరదాగా జరిగింది. కెరీర్‌లోనే ఇది నాకో మంచి చిత్రంగా నిలుస్తుంది. అంత గొప్ప స్క్రిప్ట్‌ కాబట్టే వినగానే ఓకే చేశాను. ఇందులో నాకు, షాహిద్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి’’ అని చెప్పారు కృతి. అమిత్‌ జోషీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో షాహిద్‌ శాస్త్రవేత్తగా కనిపించనున్నారు.

రూ.165 కోట్ల ఇంటిని వీడిన ప్రియాంక దంపతులు.. కారణం ఏమిటంటే?

గతేడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న కృతి ఇటీవలే ‘గణపథ్‌: ఎ హీరో ఈజ్‌ బోర్న్‌’తో ప్రేక్షకులను పలకరించారు. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించిన ఆ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించారు. కృతి ప్రస్తుతం బాలీవుడ్‌లో మరో మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ‘దో పత్తి’ అనే చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని