Priyanka Chopra: రూ.165 కోట్ల ఇంటిని వీడిన ప్రియాంక దంపతులు.. కారణం ఏమిటంటే?

నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) తన కొత్త  ఇల్లు ఖాళీ చేసినట్లు సమాచారం... ఎందుకంటే?

Published : 01 Feb 2024 14:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జొనాస్‌ (Nick Jonas)ను వివాహం చేసుకుని యూఎస్‌లో సెటిలయ్యారు బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా. తమ అభిరుచులకు తగ్గట్టు లాస్‌ ఏంజిలెస్‌లో 20 మిలియన్‌ డాలర్లతో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఆ ఇంటి నుంచి వాళ్లిద్దరూ బయటకు వచ్చేశారు. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Tripti Dimri: అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా: త్రిప్తి డిమ్రి

నీళ్లు లీక్‌ అవుతుండటంతో ఇంట్లో చాలా ప్రదేశాలు డ్యామేజ్‌ అయ్యాయట. దీంతో నష్టపరిహారం ఇప్పించాలని ఆ ఇల్లు అమ్మిన వ్యక్తిపై కోర్టులో దావా వేశారు అనేది వార్తల సారాంశం. ఈ క్రమంలోనే ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేశారని చెబుతున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆ ఇంటి విలువ సుమారు రూ.165 కోట్లు. మరమ్మతులు చేయించడానికి దాదాపు 2.5 మిలియన్‌ డాలర్లు ఖర్చు అవుతుందని సమాచారం.

అమూల్యమైన క్షణాల కోసం...

ఆ విలాసవంతమైన ఇంటిలో ఏడు పడక గదులు, తొమ్మిది బాత్‌రూమ్‌లు, టెంపరేచర్ కంట్రోల్డ్ వైన్ సెల్లార్, చెఫ్ కిచెన్, హోమ్‌ థియేటర్, స్పా, స్టీమ్ షవర్, జిమ్‌, బిలియర్డ్స్ రూమ్ లాంటివి ఉన్నాయి. పిల్లలతో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదిగా ఉండాలని ప్రియాంక - నిక్‌ ఆ ఇంటిని కొనుగోలు చేశారు. తమ ఆలోచనలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. అవుట్‌డోర్‌ స్పేస్‌, పచ్చదనం ఎక్కువ ఉండేలా చూసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని