Liger: డ్యాన్స్‌తో షేక్‌ చేస్తున్న విజయ్‌ దేవరకొండ.. ‘లైగర్‌’ ఫస్ట్‌ సాంగ్‌ చూశారా!

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ . పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండేకథానాయిక.

Published : 11 Jul 2022 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) - పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ (Liger). పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే (Ananya Pandey) కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ చిత్ర తొలి గీతం ‘అక్డీ పక్డీ’ని (Akdi Pakdi) తాజాగా విడుదల చేసింది. ఇందులోని విజయ్‌ స్పీడ్‌ డ్యాన్స్‌ అందరినీ కట్టిపడేసేలా ఉంది. బీట్‌కు తగ్గట్టు ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. అనన్యపాండే విజయ్‌తో పోటీపడి నర్తించింది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది.

ఈ ‘అక్డీ పక్డీ’ పాటను లిజో జార్జ్‌ డిజె చేతాస్‌ స్వరపరచగా.. సునీల్‌ కశ్యప్‌ హుక్‌లైన్‌ అందించారు. అజీమ్‌ దయాని సూపర్‌ వైజ్‌ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా సంయుక్తంగా ఆలపించారు. ఆలస్యమెందుకు ‘లైగర్‌’ డ్యాన్స్‌ చూసేయండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని