CM Jagan: సీఎం జగన్‌ను కలిసిన ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు

 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సమావేశమయ్యారు.

Published : 15 Feb 2022 15:50 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన మంచు విష్ణు... సీఎంతో కలిసి భోజనం చేశారు. సినిమా రంగానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయనతో చర్చించారు. సినిమా టికెట్‌ ధరల పెంపు అంశం, ఆన్‌లైట్‌ టికెటింగ్‌, సినిమా రంగానికి ప్రభుత్వ సాయం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. సీఎంతో తాను మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్టు మంచు విష్ణు తెలిపారు. ఇటీవల సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్‌బాబు, రాజమౌళి తదితరులు సీఎం జగన్‌ను కలిసి సినిమా టికెట్ల ధరలు, తదితర అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని