Dulquer Salmaan: భీమ్స్‌ బీట్స్‌ విన్న ప్రతిసారి డ్యాన్స్‌ చేస్తున్నా: దుల్కర్‌ సల్మాన్‌

‘మ్యాడ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోలు దుల్కర్‌ సల్మాన్‌, సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్‌ శ్రీలీల సందడి చేశారు. ఈ చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌ను దుల్కర్‌ కొనియాడారు.

Updated : 04 Oct 2023 23:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ హీరోలుగా కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్‌’ (MAD). ఈ సినిమా ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరోలు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), హీరోయిన్‌ శ్రీలీల (SreeLeela) ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. వేడుకనుద్దేశించి దుల్కర్‌ మాట్లాడుతూ.. ‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న తెలుగు సినిమా (లక్కీ భాస్కర్‌)లో నటించేందుకు నేను హైదరాబాద్‌ వచ్చా. ‘మ్యాడ్‌’ ట్రైలర్‌ బాగుంది. భీమ్స్‌ బీట్స్‌ విన్న ప్రతిసారి నేను డ్యాన్స్‌ చేస్తున్నా. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

మిమ్మల్నీ నవ్విస్తుంది: సిద్ధు

‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమా అంటే నా సినిమానే. కల్యాణ్‌ శంకర్‌ ఈ సినిమా కథను నాకు దుబాయ్‌లో చెప్పాడు. అది వింటున్నప్పుడే బాగా నవ్వుకున్నా. మిమ్మల్నీ నవ్విస్తుందనుకుంటున్నా. భీమ్స్‌ అందించిన సంగీతం అదిరిపోయింది. నేను నటిస్తున్న ‘టిల్లు స్వ్కేర్‌’ స్క్రిప్టులో కల్యాణ్‌ భాగమయ్యాడు’’ అని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని