Madhavan: పతకాలతో అదరగొట్టిన కుమారుడు.. ఆనందంలో హీరో మాధవన్‌

సినీ నటుడు మాధవన్‌ కుమారుడు వేదాంత్‌ మాధవన్ (Vedaant Madhavan) మరోసారి స్విమ్మింగ్‌లో పతకాలతో అదరగొట్టాడు. ఏకంగా ఏడు పతకాలు సాధించాడు. మాధవన్‌ ఈ ఫొటోలను షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.

Published : 13 Feb 2023 01:23 IST

హైదరాబాద్‌: నటుడు మాధవన్ ‌(Madhavan) తనయుడు వేదాంత్‌ మాధవన్ (Vedaant Madhavan)పై మరోసారి నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా జరిగిన ‘ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ 2023’ (Khelo India 2023)లో మాధవన్‌ కుమారుడు మరోసారి అద్భుతం సృష్టించాడు. స్విమ్మింగ్‌లో ఏకంగా ఏడు పతకాలు (5 స్వర్ణ, 2 రజత) సాధించాడు. ఆ ఫొటోలను మాధవన్‌ తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. గతంలోనూ వేదాంత్‌ స్విమ్మింగ్‌లో ఎన్నో పతకాలు సాధించి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వేదాంత్‌.. తానేం సాధించినా దాని వెనక తన తండ్రి మాధవన్‌ ఉంటాడని అన్నాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యం అని చెప్పాడు. ఈ ఫొటోలు షేర్‌ చేసిన మాధవన్‌ ‘‘వేదాంత్‌ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అతడికి సహకరించిన అందరికి ధన్యవాదాలు’’ అని అన్నారు. ఇది చూసిన నెటిజన్లు మాధవన్‌, వేదాంత్‌లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సినీ, క్రీడా ప్రముఖులు కూడా అభినందనలు తెలుపుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని