Manu charitra: ఓటీటీలోకి వచ్చేసిన ‘మనుచరిత్ర’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

భరత్‌ పెదగాని డైరెక్షన్‌లో వచ్చిన తొలి సినిమా ‘మనుచరిత్ర’ (Manu charitra). ఇప్పుడీ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.  

Published : 21 Jul 2023 15:55 IST

హైదరాబాద్‌: భరత్ పెదగాని దర్శకత్వంలో శివ కందుకూరి నటించిన సినిమా ‘మను చరిత్ర’ (Manu charitra). జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రచార చిత్రాల్లో ‘అర్జున్‌రెడ్డి’ని తలపించిన ఈ చిత్రం థియేటర్లో మాత్రం మిశ్రమ ఫలితానికే పరిమితమైంది. అయితే శివ కందుకూరి, మేఘా ఆకాష్‌ల నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమోజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) వేదికగా ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది.

ఓటీటీలోకి ‘సామజవరగమన’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

క‌థేంటంటే: మ‌ను దుర్గరాజు (శివ కందుకూరి) ఎప్పుడూ టాప్‌లో ఉండే ఓ స్టూడెంట్‌. ఊరు వ‌రంగ‌ల్‌. స్నేహితుడు నందు (సుహాస్‌) అంటే ప్రాణం. కాలిక‌ట్  ఎన్‌.ఐ.టిలో చ‌ద‌వాల్సిన ఈ కుర్రాడి జీవితం అనూహ్యంగా మ‌లుపు తిరుగుతుంది. మ‌ద్యానికి బానిసై క‌నిపించిన అమ్మాయిలకు ఐ లవ్‌ యూ అని చెబుతుంటాడు.  శ్రావ్య‌, ఆయేషా, స్టెల్లా, జాను... ఇలా చాలా మంది అమ్మాయిల‌కి ద‌గ్గ‌ర‌వుతాడు. ఎంత తొంద‌ర‌గా ద‌గ్గ‌ర‌వుతాడో అంతే వేగంగా బ్రేక‌ప్ చెప్పేస్తుంటాడు.  అందుకు కార‌ణం జెన్నీ (మేఘ ఆకాష్‌). ఇంత‌కీ  మ‌నుకీ, జెన్నీకి మ‌ధ్య ఉన్న సంబంధమేమిటి? ఆమె వ‌ల్ల మ‌ను జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లు ఎలాంటివి?(Manu charitra on OTT) అత‌డి జీవితాన్ని  ప్ర‌భావితం చేసిన రౌడీ రుద్ర (డాలీ ధ‌నుంజ‌య్‌) క‌థేమిట‌నేది తెలియాలంటే అమోజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న  ‘మనుచరిత్ర’ చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని