Meenakshi Chaudhary: ఆ కారణంగా ఎన్నో సినిమాలు తిరస్కరించా: మీనాక్షి చౌదరి

హీరోయిన్‌ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కొన్ని నియమాలు పెట్టుకున్నట్లు తెలిపింది.

Published : 25 Jul 2023 12:49 IST

హైదరాబాద్: ‘హిట్‌-2’తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని వరుస అవకాశాలు అందుకుంటోంది హీరోయిన్‌ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన మీనాక్షి.. కెరీర్‌ తొలి నాళ్లలోనే మంచి సినిమాల్లో అవకాశాలు రావడం ఆనందంగా ఉందని చెప్పింది.

‘‘ప్రస్తుతం చాలా స్క్రిప్టులు వింటున్నాను. కథల ఎంపికలో జాగ్రత్త తీసుకుంటున్నాను. బిజీగా ఉండడం కోసం కాకుండా.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలి. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ఏ భాషలో అయినా గొప్ప సినిమాల్లో అవకాశం వస్తే అది నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను. తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్నాను’’ అని చెప్పింది. అలాగే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)లో చాలామంది గొప్ప టెక్నిషియన్స్‌ పనిచేస్తున్నారని తెలిపింది.

సోషల్ మీడియాలోనూ ‘తగ్గేదేలే’.. అల్లు అర్జున్‌ సరికొత్త రికార్డు

ఇక తెరపై ముద్దు సన్నివేశాల గురించి మీనాక్షి మాట్లాడుతూ..‘‘ఏదైనా సన్నివేశం నాకు అసౌకర్యంగా అనిపిస్తే దాన్ని ముందుగానే అంగీకరించను. ఇలా ఎన్నో సినిమాలు తిరస్కరించాను. కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నియమం పెట్టుకున్నా. అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని నిర్ణయించుకున్నాను. దీని కారణంగా ఎన్నో అవకాశాలను తిరస్కరించాను. అలాగే కొత్త తరహా పాత్రల్లో నటించేందుకు వెనక్కి తగ్గను. అవకాశం ఉన్నప్పుడే విభిన్న పాత్రల్లో నటించాలని నా అభిప్రాయం ’’ అని మీనాక్షి చౌదరి తన నిర్ణయాన్ని చెప్పింది.

ఇక ఈ అమ్మడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ (ichata vahanamulu niluparadu)తో తెలుగు తెరకు పరిచయమై, తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకుంది. ప్రస్తుతం మహేశ్‌ బాబు (Mahesh Babu), విష్వక్ సేన్, వరుణ్‌ తేజ్‌ (Varun Tej)ల సినిమాల్లో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని