Bholaa Shankar: ప్యారీ సుకుమారి.. చిలిపిగ నోరూరి

‘‘మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ.. అరె నీకు నాకు డేటింగు పార్టీ’’ అంటూ తమన్నాతో కలిసి ఆడిపాడుతున్నారు కథానాయకుడు చిరంజీవి.

Updated : 22 Jul 2023 14:04 IST

‘‘మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ.. అరె నీకు నాకు డేటింగు పార్టీ’’ అంటూ తమన్నాతో కలిసి ఆడిపాడుతున్నారు కథానాయకుడు చిరంజీవి. ఇప్పుడీ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర నిర్మించారు. కీర్తి సురేష్‌, సుశాంత్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా శుక్రవారం ఈ సినిమా నుంచి మూడో గీతాన్ని విడుదల చేశారు. ‘‘పంచదార చిలక లాంటి ప్యారీ సుకుమారి.. నీ చమక్కు చూసి దుముకుతున్నా చిలిపిగ నోరూరి’’ అంటూ సాగుతున్న ఈ పాటకు మహతి స్వర సాగర్‌ స్వరాలు సమకూర్చడమే కాక విజయ్‌ ప్రకాష్‌, సంజన కల్మంజేతో కలిసి స్వయంగా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటలో చిరు - తమన్నాల కెమిస్ట్రీ చూడముచ్చటగా చూపించారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించున్నారు. ఈ చిత్రానికి కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఛాయాగ్రహణం: డడ్లీ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని