Prabhas: ముహూర్తం ఖరారు

ప్రభాస్‌ - మారుతి కలయికలో సినిమా కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచే చిత్రీకరణ షురూ కానుంది. ఈ నెల 10నే చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. స్క్రిప్టు పనులు దాదాపుగా తుది దశకు చేరాయి. హారర్‌ కథతో, మారుతి మార్క్‌ వినోదంతో ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలిసింది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఇప్పటికే పలువురు భామల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా...

Updated : 04 Apr 2022 13:31 IST

ప్రభాస్‌ - మారుతి కలయికలో సినిమా కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచే చిత్రీకరణ షురూ కానుంది. ఈ నెల 10నే చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. స్క్రిప్టు పనులు దాదాపుగా తుది దశకు చేరాయి. హారర్‌ కథతో, మారుతి మార్క్‌ వినోదంతో ఈ చిత్రం రూపొందనున్నట్టు తెలిసింది. ఇందులో ప్రభాస్‌కి జోడీగా ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఇప్పటికే పలువురు భామల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారు. ప్రభాస్‌ అభిమానుల్ని అలరించడమే లక్ష్యంగా రూపొందనున్న ఈ సినిమా వేగంగానే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని