Naga Chaitanya: బాలా.. బాలరాజు బోడి

ఆమిర్‌ ఖాన్‌.. నాగచైతన్య కలిసి నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్ఢా’. అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించారు. కరీనా కపూర్‌ కథానాయిక. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా రూపొందింది.

Updated : 30 Jul 2022 08:52 IST

ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan).. నాగచైతన్య (Naga Chaitanya) కలిసి నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్ఢా’ (LaalSingh Chaddha). అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించారు. కరీనా కపూర్‌ (Kareena Kapoor) కథానాయిక. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాలో చైతన్య.. బాలరాజు బోడి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. అందులో చైతూ విభిన్నమైన లుక్స్‌లో కనిపించారు. ఈ పాత్ర కోసం తొలుత బాలకృష్ణ, బలరాం.. ఇలా రకరకాల పేర్లు అనుకున్నామని.. ఆఖరికి బాలరాజు బోడి అనే పేరు ఫిక్సయ్యామని నాగచైతన్య ఆ వీడియోలో తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగులో కథానాయకుడు చిరంజీవి సమర్పిస్తున్నారు. ఇది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని