NBK 109: బాలకృష్ణ కొత్త సినిమా షురూ..!
నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా కొత్త సినిమా పట్టాలెక్కింది. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
హైదరాబాద్: వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ప్రస్తుతం అనిల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ చేస్తోన్న ఆయన తాజాగా తన 109వ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఇది రూపుదిద్దుకోనుంది. శనివారం బాలయ్య పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. త్రివిక్రమ్, వి.వి.వినాయక్, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం దర్శకుడు వి.వి. వినాయక్ తన చేతుల మీదుగా చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. దక్షిణ కొరియా గౌరవ కౌన్సిల్ జనరల్ చుక్కపల్లి సురేష్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన కాన్సెప్ట్‌పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఇనుప పెట్టెలో కత్తులు, గొడ్డలి, సుత్తి, సిగరెట్ పెట్టె, మందు బాటిల్, తుపాకీ గుళ్లు ఉన్నాయి. పోస్టర్‌పై 1982 అని రాసి ఉంది. ఒక సరికొత్త కథతో, డిఫరెంట్ ఫ్లాష్‌బ్యాక్‌తో బాబీ ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్లు అర్థమవుతోంది. పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.