అందుకే ఆ రిస్క్ తీసుకోలేను..!
నాకు కటౌట్లు అవసరం లేదు మీ అభిమానం చాలు. పాలాభిషేకాలు వద్దు మీ ప్రేమ చాలు. స్టార్ అని పిలవద్దు మీ ఇంట్లో వ్యక్తిగా నాని అని పిలవండి చాలు’ అంటుంటారు యువ కథానాయకుడు నాని
‘నాకు కటౌట్లు అవసరం లేదు మీ అభిమానం చాలు. పాలాభిషేకాలు వద్దు మీ ప్రేమ చాలు. స్టార్ అని పిలవద్దు మీ ఇంట్లో వ్యక్తిగా నాని అని పిలవండి చాలు’ అంటుంటారు యువ కథానాయకుడు నాని. ఎప్పటికప్పుడు విభిన్న కథల్ని ఎంపిక చేసుకుంటూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు. ఫలితం ఎలా ఉన్నా ప్రయోగాలు చేసేందుకు ముందుంటారు. నటుడు, నిర్మాత, వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నాని పుట్టిన రోజు (బుధవారం) సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు తెలుసుకుందాం...
అలా మొదలైంది..
నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు. రాంబాబు, విజయ లక్ష్మీ దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించారు. నానికి అక్క ఉన్నారు. పేరు దీప్తి. స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం. విశాఖపట్నానికి చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకో అబ్బాయి. తొలినాళ్లలో రేడియో జాకీగా అలరించారు నాని. కొన్నాళ్లు బాపు, శ్రీను వైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనుకోకుండా ‘అష్టా చమ్మా’ చిత్రంతో కథానాయకుడిగా మారారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిందా చిత్రం. అలా 2008లో మొదలైంది ఆయన నట ప్రయాణం. కథానాయకుడుగా ఇప్పటికే 25 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. 26వ సినిమా ‘టక్ జగదీష్’ ఏప్రిల్‌లో రాబోతుంది. 27వ చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రీకరణ జరుపుకుంటోంది. 28వ సినిమాగా ‘అంటే సుందరానికీ!’ ఖరారైంది. సంవత్సరానికి రెండు మూడు చిత్రాలు అందించేందుకు ఆసక్తి చూపుతుంటారు నాని. కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు చవిచూసినా నిలదొక్కుకుని ‘నేచులర్ స్టార్’గా ఎదిగారు.
సినిమా ప్రచారంలో ప్రత్యేకం..
నాని గళానికీ అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘ఓకే బంగారం’ చిత్రానికి నానితో డబ్బింగ్ చెప్పించారు. సినిమా ప్రచార విషయంలోనూ నాని రూటు సెపరేట్ అనాల్సిందే. సామాజిక మాధ్యమాల్లో అలతి పదాలతో ఆయన పెట్టే పోస్టులు ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. ఇలా ప్రేక్షకుల్ని థియేటర్‌కి రప్పించడమే కాదు సినిమా ప్రారంభానికి ముందు వచ్చే ప్రకటనల్ని(యాడ్స్) తనదైన శైలిలో వినిపించి దట్ ఈజ్ నాని అనిపిస్తారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘పైసా’. ఈ సినిమాతోనే నాని ‘పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అని తొలిసారి సూచించారు. ఆ తర్వాత టైటిల్‌కి తగ్గట్టు చెప్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో కొన్ని...
* మందు సిగరెట్లు తాగకండి పోతారు.. లోకలైనా నాన్లోకలైనా (నేను లోకల్)
* మందు సిగరెట్టు తాగకండి పోతారు.. హీరో అయినా విలన్ అయినా (జెంటిల్‌మేన్)
* తెలుగు సినిమాలే చేస్తా..
జీవితాంతం తెలుగు సినిమాలే చేస్తాను. ఎస్వీ రంగారావు, ప్రకాశ్ రాజ్, నానాపటేకర్ వంటి వారు భాష మీదున్న పట్టు వల్ల మంచి నటులయ్యారు. నాకు వచ్చిన భాష తెలుగు. అందులోనే ఓ మాటను సొంతం చేసుకుని చెప్పగలను. మరో భాషలో అలా చేయలేను. తెలుగు ప్రేక్షకులకు నచ్చినట్టుగా ఇతర చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అందుకే బాలీవుడ్ వెళ్లే ఆలోచన లేదని ఓ సందర్భంలో తెలిపారు నాని
* ఫాలోయింగ్..
2012లో ట్విటర్ ఖాతా తెరిచారు నాని. ఆయనను ఇప్పటివరకూ అనుసరిస్తున్న వారి సంఖ్య: 3.9 మిలియన్ పైగా. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్: 3.4 మిలియన్ పైగా.
* ఇష్టమైన దర్శకులు : రాజమౌళి, మణిరత్నం, త్రివిక్రమ్.
* బాగా నచ్చిన చిత్రం: దళపతి
* వంట: అమ్మమ్మ చేసే చేపల పులుసు
* ఇష్టమైన డ్రెస్: తెల్లచొక్కా, నీలం జీన్స్
* విజయం, ఓటమిలోనూ ఒకేలా ఉండటం నాని పాలసీ
* బాల్యంలో అక్క దీప్తితో..
*తండ్రి రాంబాబుతో..
* తల్లితో కలిసి ఇలా..
*కొడుకు అర్జున్‌తో సరదాగా..
*సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకున్న తొలి ఫొటో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే