Nani: ఓ దర్శకుడు అందరి ముందు నన్ను అవమానించాడు: నాని
‘దసరా’ (Dasara) ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారు నటుడు నాని (Nani). దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తొలినాళ్లలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు చెప్పారు.
హైదరాబాద్: సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన సవాళ్లపై నటుడు నాని (Nani) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరీ, ముఖ్యంగా ఓ దర్శకుడు తనని అందరి ముందు అవమానించాడని చెప్పారు. ‘‘ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు కదా.. మొదట్లో ఏమైనా కష్టంగా అనిపించిందా?’’ అని విలేకరి ప్రశ్నించగా..
‘‘కష్టంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనేది మొదట అర్థం కాదు. సాయం చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు. మనం నేర్చుకుంటున్న సమయంలోనే కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు కానీ, దాని తర్వాత వచ్చే సక్సెస్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. నేను ఎన్నో సవాళ్లు, తిరస్కరణలు ఎదుర్కొన్నా. ఆ వివరాలు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. సినీ పరిశ్రమలో ఉన్న ఎంతోమందితో పోలిస్తే నేను పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొలేదని భావిస్తుంటా. నాకంటే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడిన వాళ్లు నాకు తెలుసు’’
‘‘ఒకవేళ నువ్వు (విలేకరి నుద్దేశించి) గనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండీ.. అందులోనూ క్లాప్ అసిస్టెంట్‌గా ఉంటే ఇలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే.. నీకు ఏదైనా చెప్పేయొచ్చని అనుకుంటారు. ఇష్టం వచ్చినట్లు మాటలు అంటారు. వాళ్లందరికీ గట్టిగా సమాధానం చెప్పాలని ఉన్నా.. అన్నింటినీ దిగమింగక తప్పదు. అలాంటి ఎన్నో ఇబ్బందులు నేను ఎదుర్కొన్నా. క్లాప్‌బోర్డ్ ఆలస్యమైనా ఏదో ఒకటి అనేవారు. మాటలు పడినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు. కానీ, ఓ దర్శకుడు మాత్రం సెట్‌లో అందరి ముందు నన్ను అవమానించాడు. నేను ఎప్పటికీ దర్శకుడిని కాలేనని అన్నాడు. ఆ మాట నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. అలాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా. స్టార్‌ని అయ్యాక ఆ దర్శకుడిని కలిశా. అప్పుడు కూడా మా చుట్టూ ఉన్న వాతావరణం చెప్పుకోదగిన విధంగా లేదు’’ అని నాని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/09/2023)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్