Dasara: ‘ఈ దసరా నిరుడులెక్కుండదు’.. నాని యాక్షన్‌ చిత్రం మొదలైంది

‘ఈ దసరా నిరుడులెక్కుండదు’ అంటూ టైటిల్‌ టీజర్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు నటుడు నాని.

Published : 16 Feb 2022 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈ దసరా నిరుడులెక్కుండదు’ అంటూ టైటిల్‌ టీజర్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు నటుడు నాని. ఆయన హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దసరా’. గతేడాది దసరాకి టైటిల్‌ను ప్రకటించిన చిత్ర బృందం బుధవారం లాంఛనంగా చిత్రీకరణను ప్రారంభించింది. దర్శకులు సుకుమార్‌, కిశోర్‌ తిరుమల తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర నిర్మాత సుధాకర్‌ చెరుకూరి, కిశోర్‌ తిరుమల స్క్రిప్టును దర్శకుడికి అందజేయగా ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్‌కొట్టారు. రెగ్యులర్‌ షూటింగ్‌ మార్చిలో ప్రారంభంకానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్‌ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాని తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పనున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఇప్పటికే ఆయన కసరత్తులు మొదలెట్టారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నారు. నాని సరసన కీర్తి సురేశ్‌ సందడి చేయనుంది. ‘నేను లోకల్‌’ తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రమిది. మరోవైపు, వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటించిన ‘అంటే సుందరానికీ..!’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని