చైతన్య ప్రేమ సందేశం.. నిహారిక కన్నీళ్లు

ఏ అమ్మాయి జీవితంలోనైనా వివాహమనేది ఓ మధురమైన అనుభూతి. ఎన్నో బంధాలు.. అనుబంధాలు.. భావోద్వేగాలకు వివాహం ఓ వేదికగా మారుతుంది. పుట్టింటి బంధాలకు దూరంగా అత్తవారింటిలోకి అడుగుపెట్టే ప్రతి యువతి పెళ్లి సమయంలో...

Published : 25 Jan 2021 10:55 IST

సుస్మితను హత్తుకుని ఉద్వేగానికి లోనైన నటి

హైదరాబాద్‌: ఏ అమ్మాయి జీవితంలోనైనా వివాహమనేది ఓ మధురమైన అనుభూతి. ఎన్నో బంధాలు.. అనుబంధాలు.. భావోద్వేగాలకు వివాహం ఓ వేదికగా మారుతుంది. పుట్టింటి బంధాలకు దూరంగా అత్తవారింటిలోకి అడుగుపెట్టే ప్రతి యువతి పెళ్లి సమయంలో ఉద్వేగానికి లోనవుతుంది. కాగా, నిహారిక సైతం తన పెళ్లి సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఓ వీడియోని షేర్‌ చేశారు.

పెళ్లి వేడుకలు ప్రారంభించిన నాటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియోలో తెలుస్తోంది. ‘ప్రియమైన నిహా.. వివాహబంధంతో మన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. ముప్పైయేళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని తెలిసింది’ అంటూ చైతన్య పంపించిన సందేశం చూసి నిహారిక భావోద్వేగానికి గురయ్యారు.

కల్యాణ తిలకం దిద్దే సమయంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను హత్తుకుని నిహారిక ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాకుండా పెళ్లి మండపంలో మెగాబ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సరదాగా మాట్లాడుకోవడం.. వరుణ్‌తేజ్‌, బన్నీ ఆత్మీయ ఆలింగనం.. ఇలా ఎన్నో మధుర క్షణాలను ఈ వీడియోలో పొందుపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇదీ చదవండి

నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్‌


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని