Nithiin: పవన్‌ కల్యాణ్‌తో సినిమా.. నితిన్‌ ఏమన్నారంటే?

పవన్‌ కల్యాణ్‌తో ఎప్పుడు నటిస్తారు? అనే ప్రశ్న ఎదురవగా నితిన్‌ స్పందించారు. మరి, ఆయన ఏం సమాధానం ఇచ్చారంటే?

Updated : 10 Nov 2023 19:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా’. ఆర్డినరీ మ్యాన్‌.. ట్యాగ్‌లైన్‌ (Extra Ordinary Man). శ్రీలీల (Sreeleela) కథానాయిక. ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో వేడుక నిర్వహించి ‘బ్రష్‌ వేస్కో’ (Brush Vesko) పాటను విడుదల చేసింది. నితిన్‌ విద్యార్థులతో కలిసి డ్యాన్స్‌ చేసి అలరించారు. అనంతరం, వారితో కాసేపు ముచ్చటించారు.

* మీ జీవితం పెళ్లికి ముందు ఎక్స్‌ట్రార్డినరీనా, పెళ్లి తర్వాత ఎక్స్‌ట్రార్డినరీనా?

నితిన్‌: పెళ్లికి ముందు ఎక్స్‌ట్రా. పెళ్లి తర్వాత ఎక్స్‌ట్రార్డినరీ.

* మీ భార్యను ఏమని పిలుస్తారు?

నితిన్‌: బేబీ.

* పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఎప్పుడు నటిస్తారు?

నితిన్‌: ఆ అవకాశం కోసం నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా.

* నా పేరు అను. మీ తదుపరి చిత్రంలోని హీరోయిన్‌కు నా పేరు పెడతారా?

నితిన్‌: తప్పకుండా.

* మీ ఫస్ట్‌ క్రష్‌ ఎవరు?

నితిన్‌: మూడో తరగతిలో నా ఫ్రెండ్‌.

* భవిష్యత్‌లో మిమ్మల్ని లవ్‌స్టోరీస్‌లో చూడొచ్చా?

నితిన్‌: ప్రస్తుతానికి సంతకం చేసిన సినిమాలన్నీ కామెడీ నేపథ్యంలో రూపొందేవే. అవి పూర్తయ్యాక లవ్‌స్టోరీ చిత్రాలు చేస్తా. 

‘ఎక్స్‌ట్రా’ గురించి మాట్లాడుతూ.. ‘‘దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో నేను నటించిన 32వ చిత్రమిది. ఇందులో నటించిన పాత్రను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ పోషించలేదు. పలు షేడ్స్‌ ఉన్న ఇలాంటి క్యారెక్టర్‌ తదుపరి చిత్రాల్లో వస్తుందో, రాదో నాకు తెలియదు. ఈ సినిమాలోని లాస్ట్‌ సాంగ్‌కు నేను, శ్రీలీల నువ్వా-నేనా? అన్నట్లు డ్యాన్స్‌ చేశాం. అదిరిపోద్ది. ఈ సినిమా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది’’ అని నితిన్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని