Nithiin: నితిన్‌ కొత్త చిత్రం టైటిల్‌ ఇదే..

నితిన్‌ (Nithiin) వక్కంతం వంశీ కాంబోలో రానున్న సినిమా టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. యువతను ఆకట్టుకునేలా ఉన్న ఈ టైటిల్‌ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌ అవుతోంది.  

Published : 23 Jul 2023 18:06 IST

హైదరాబాద్‌: నితిన్‌ (Nithiin) కథానాయకుడిగా వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌, నితిన్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు దీనికి ‘ఎక్స్‌ట్రా’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ‘ఆర్డినరీ మ్యాన్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. ‘‘ప్రతి ఆర్డినరీ మ్యాన్‌కి ఒక ఎక్సాట్రాడినరీ కథ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 23న దీనిని విడుదల చేయనున్నాం. మరింత ప్రేమ, ఫన్‌ను మీ అందరికీ పంచేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని నితిన్‌ పేర్కొన్నారు.

ఈ మార్పులు చేయండి.. అలియా-రణ్‌వీర్‌ చిత్రబృందానికి సెన్సార్‌ సూచన

‘మాచర్ల నియోజకవర్గం’ తర్వాత నితిన్‌ నటిస్తోన్న చిత్రమిది. యూత్‌ఫుల్‌ కథాంశంతో సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా శ్రీలీల కనిపించనున్నారు. హరీశ్‌ జయరాజ్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రేష్ఠ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి దీన్ని నిర్మిస్తున్నారు. 2018లో విడుదలైన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ‘ఏజెంట్‌’ చిత్రానికి వంశీనే కథ అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు