VNRTrio: గ్రాండ్‌గా నితిన్, రష్మికల సినిమా లాంచ్.. క్లాప్ కొట్టిన చిరంజీవి
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక నటిస్తోన్న చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. చిరంజీవి క్లాప్ కొట్టి చిత్రాన్ని లాంచ్ చేశారు.
హైదరాబాద్: యంగ్ హీరో నితిన్ (Nithiin), నేషనల్ క్రష్ రష్మిక (Rashmika)ల కొత్త చిత్రం ప్రారంభమైంది. వెంకీ కుడుముల (Venky Kudumula) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంచ్ అయింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌ను ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. అలాగే దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. #VNRTrio అనే హ్యష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి.
వీళ్ల ముగ్గురి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడం.. చిరంజీవి ప్రారంభించడంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ స్వరాలు అందిస్తున్నారు. ఇక గతంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికలు ‘భీష్మ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచి మంచి కలెక్షన్లు రాబట్టింది. దీని తర్వాత వెంకీ కుడుముల చిరంజీవితో ఓ మూవీ ప్లాన్ చేశారు. స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉండటంతో ఆ చిత్రం కొంత ఆలస్యమవుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers protest: రెజ్లర్లపై దిల్లీ పోలీసుల తీరు దారుణం.. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే..!
-
Politics News
Chandrababu: ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’.. ఎన్నికల వరాలు ప్రకటించిన చంద్రబాబు
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు