NTR: ఫ్యాన్స్ మీట్.. అభిమాని తల్లితో ఎన్టీఆర్ వీడియో కాల్
ఆస్కార్ (Oscars) ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు నటుడు ఎన్టీఆర్ (NTR). మంగళవారం అమెరికా వెళ్లిన ఆయన తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఇంటర్నెట్‌డెస్క్: తనని ప్రేమించే అభిమానులన్నా, వారి కుటుంబసభ్యులన్నా ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR). అమెరికా వేదికగా అది మరోసారి నిరూపితమైంది. తనతో మాట్లాడాలని ఆశపడ్డ ఓ అభిమాని తల్లిని తారక్ వీడియో కాల్‌లో సంప్రదించారు.
‘ఆస్కార్’ (Oscars) ప్రమోషన్స్ కోసం మంగళవారం అమెరికాకు చేరుకున్నారు ఎన్టీఆర్ (NTR). ఇందులో భాగంగా యూఎస్‌లోని తన అభిమానులతో ఆయన కాసేపు సరదాగా గడిపారు. ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొని అక్కడి వాళ్లందరితో ఫొటోలు దిగారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని.. ‘‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టం అన్నా. ఒక్కసారి మాట్లాడతారా?’’ అని అడగ్గా తారక్ అంగీకరించారు. ఆ వ్యక్తి తన తల్లికి వీడియో కాల్ చేయగా ఆయన ఫోన్ తీసుకుని ఓ కుటుంబసభ్యుడిలా మాట్లాడారు. ‘ఎలా ఉన్నారమ్మా. నేను బాగున్నాను. తప్పకుండా కలుద్దాం అమ్మా’ అని మాటిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ ప్రియులు ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: ఆయన క్షమాపణలు చెప్పారని నిరూపించండి: రాహుల్‌కు సావర్కర్ మనవడి సవాల్
-
General News
TSPSC: ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్ విచారణ
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..