ott movies in telugu: ఈ వారం ఓటీటీలో 22 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

ott movies: ఈ వారం ఓటీటీలో వేదికగా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Updated : 15 Jun 2023 16:39 IST

అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో..

క్రిస్‌ హేమ్స్‌ వర్త్‌ (Chris Hemsworth) కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఎక్స్‌ట్రాక్షన్‌2’ (Extraction 2). 2020లో వచ్చిన ‘ఎక్స్‌ట్రాక్షన్‌’కు కొనసాగింపుగా ఈ సినిమాను సామ్‌ హర్‌గ్రేవ్‌ తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్‌ 16న ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ప్రచార చిత్రాలు చూస్తే మొదటి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే యాక్షన్‌ సన్నివేశాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. మరి టేలర్‌ (హేమ్స్‌ వర్త్‌) ఏ మిషన్‌ కోసం రంగలోకి దిగాడు? అందులో విజయం సాధించాడా? లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


హింస, అసభ్య పదజాలం దట్టించి ‘సైతాన్‌’

ఇటీవల కాలంలో  మితిమీరిన హింస, అసభ్య పదజాలమే పరమావధిగా పలు వెబ్‌సిరీస్‌లను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఆ కోవలో వస్తున్న మరో సిరీస్‌ ‘సైతాన్‌’. ‘ఆనందో బ్రహ్మా’, ‘యాత్ర’వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి.వి.రాఘవ పూర్తి భిన్నమైన కథతో వెబ్‌సిరీస్‌ రూపొందించారు. రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాలతో ముడిపడిన కథతో ‘సైతాన్‌’ తెరకెక్కించినట్లు వెబ్‌సిరీస్‌ బృందం చెబుతోంది. గురువారం నుంచే డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.


ఓటీటీకి సిద్ధమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అన్నీ మంచి శకునములే’ ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఎమోషనల్‌గా ప్రతి ఒక్కరినీ కదిలించింది. సంతోష్‌ శోభన్‌, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జూన్‌ 17 నుంచి అందుబాటులో (Anni manchi sakunamule OTT Release) ఉండనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రైమ్‌ (amazon prime) ట్వీట్‌ చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.


బిచ్చగాడు వచ్చేస్తున్నాడు

తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony), కావ్య థాపర్‌ (Kavya Thapar) ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2). విజయ్‌ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే నెలాఖర్లో థియేటర్లలో విడుదలై సూపర్‌హిట్‌ అందుకుంది. సోదరి సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2 OTT Release) ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 18 నుంచి ఈ సినిమా సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దీన్ని వీక్షించవచ్చు.

ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • బ్లాక్‌ వకర్‌ (జపనీస్‌)  జూన్‌ 16
  • ది విలేజ్‌ (జపనీస్‌)  జూన్‌ 16

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • జీ కర్దా (హిందీ) జూన్‌ 15
  • కాందహార్‌ (ఇంగ్లీష్‌) జూన్‌ 16
  • రావణకొట్టం (తమిళం) జూన్‌ 16

  • చార్లీస్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (మలయాళం) జూన్‌ 16
  • తారమ్‌ తీర్థ కూడర్‌ (మలయాళం)జూన్‌ 16
  • టూ సోల్స్‌ (తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • హైవే లవ్‌ (హిందీ) అమెజాన్‌ టీవీ మిని (సిరీస్‌-1)

డిస్నీ+హాట్‌స్టార్‌

  • షెవలియర్‌ (హాలీవుడ్‌) జూన్‌ 16

జీ5

  • తమిళరసన్‌ (తమిళ్‌) జూన్‌ 16
  • సియా (హిందీ) జూన్‌ 16

సోనీలివ్‌

  • ఫర్హానా (తమిళ చిత్రం) జూన్‌ 16


లయన్స్‌ గేట్‌ప్లే

  • డెస్పరేట్‌ రైడర్స్‌ (హాలీవుడ్) జూన్‌ 16

జియో సినిమా

  • రఫూచక్కర్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 15
  • ఐ లవ్‌ యూ (హిందీ చిత్రం)జూన్‌ 16

ఈటీవీ విన్‌

  • కనులు తెరిచినా కనులు మూసినా (తెలుగు) జూన్‌ 16


మనోరమా మ్యాక్స్‌

  • వామనన్‌ (మలయాళం) జూన్‌ 16
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని