ott movies: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. 25 చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!
ott movies: ఈ వారం వివిధ ఓటీటీ వేదికలుగా అలరించే వెబ్‌సిరీస్, చిత్రాల వివరాలు మీకోసం..
This week ott movies: వేసవి వినోదాల విందును కొనసాగిస్తూ అటు థియేటర్‌తో పాటు ఇటు ఓటీటీలో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. మరి మే చివరి వారంలో వినోదాలను పంచడానికి వస్తున్న సినిమాలేంటో చూసేయండి.
నేరుగా ఓటీటీలో..
విశ్వక్‌సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మోనికా, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన హారర్ మూవీ ‘బూ’ (BOO). విజయ్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్‌లో విడుదల కాలేదు. ఇప్పుడు నేరుగా ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జియో సినిమా వేదికగా మే 27వ తేదీ నుంచి ‘బూ’ స్ట్రీమింగ్ కానుంది.
సత్తిగాని రెండెకరాలు ఏమయ్యాయి?
‘పుష్ప’ లో హీరో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కనిపించి, ప్రేక్షకుల్ని అలరించిన నటుడు.. జగదీష్ ప్రతాప్ బండారి (Jagadeesh). ఈయన ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు అభినవ్ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’ (Sathi Gani Rendu Ekaralu). ఈ సినిమా నేరుగా ఓటీటీ (ott) ‘ఆహా’ (aha)లో ఈ నెల 26న విడుదల కానుంది. మరి సత్తిగాని రెండెకరాల కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఓటీటీలో సల్మాన్ చిత్రం
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). పూజా హెగ్డే కథానాయిక. తెలుగు హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తమిళ సూపర్ హిట్ ‘వీరమ్’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. మే 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఎట్టకేలకు వస్తున్న ‘భేదియా’
వరుణ్ ధావన్ (Varun Dhawan) కృతి సనన్ (Kriti Sanon) జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ ‘భేదియా’ (bhediya ott release). తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. అమర్ కౌశిక్ తెరకెక్కించారు. ప్రముఖ స్ట్రీమింగ్ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్ కానుంది.
సిటడెల్ ఫైనల్ ఎపిసోడ్
ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటడెల్’ (Citadel). రిచర్డ్ మ్యాడన్ (Richard Madden), ప్రియాంక చోప్రా (Priyanka Chopra), జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28 నుంచి వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున అందిస్తున్నారు. చివరి ఎపిసోడ్ మే 26 స్ట్రీమింగ్ కానుంది.
నెట్‌ఫ్లిక్స్
- విక్టిమ్/సస్పెక్ట్ (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది.
- మదర్స్ డే (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది.
- ఫ్యూబర్ (వెబ్‌సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది.
- దసరా (హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది.
- ఆపరేషన్ మేఫెయిర్ (హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది.
- బీడ్ (హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది.
- బ్లడ్ అండ్ గోల్డ్ (జర్మన్) మే 26
- టిన్ అండ్ టీనా (స్పానిష్) మే 26
- టర్న్ ఆఫ్ ది టైడ్ (పోర్చుగీస్) నెట్‌ఫ్లిక్స్ సిరీస్-1 మే26
- చోటా భీమ్ (హిందీ) సిరీస్-18 మే 26
- బ్లడ్ అండ్ గోల్డ్ (హాలీవుడ్) మే 26
అమెజాన్ ప్రైమ్
- మిస్సింగ్ (ఒరిజినల్ మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
- ‘పంచువమ్ అద్భుత విళక్కుమ్’(మలయాళం/తెలుగు) మే 26
జియో సినిమా
- థగ్స్ (తెలుగు/తమిళ్/హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది
- క్రాక్ డౌన్ (వెబ్‌సిరీస్-సీజన్2) స్ట్రీమింగ్ అవుతోంది
- చిత్రకూట్ (హిందీ) మే 27
జీ5
- సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (ఒరిజినల్ మూవీ) మే 23
- విడుదల: పార్ట్-1 (తెలుగు) స్ట్రీమింగ్ అవుతోంది
డిస్నీ+హాట్‌స్టార్
- అమెరికన్ బోర్న్ చైనీస్ (వెబ్‌సిరీస్) మే 24
- సిటీ ఆఫ్ డ్రీమ్స్ (వెబ్‌సిరీస్-3) మే 26
ఆహా
- గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్-3) మే 23
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: కోర్టు బోనెక్కనున్న రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
-
Movies News
Ahimsa movie review: రివ్యూ: అహింస.. దగ్గుబాటి అభిరామ్ ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే?
-
India News
Periodic Table: పిరియాడిక్ టేబుల్‌ను ఎందుకు తొలగించామంటే..? NCERT వివరణ
-
Sports News
WTC Final: అశ్విన్ తుది జట్టులో ఉంటాడా... లేదా? ఆస్ట్రేలియా శిబిరంలో ఇదే హాట్ టాపిక్!
-
World News
Putin: చర్చితో సంబంధాలు బలపర్చుకొనే యత్నాల్లో పుతిన్..!
-
Crime News
Hyderabad: కారు డ్రైవర్ నిర్లక్ష్యం.. రెండేళ్ల చిన్నారి మృతి