ott movies this week: ఈ వారం ఓటీటీలో 19 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు

ott movies this week: ఈ వారం ఓటీటీ వేదికగా పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. కొన్ని ఇప్పటికే అందుబాటులోకి రాగా, మరికొన్ని వీకెండ్‌లో సందడి చేయనున్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేయండి

Updated : 27 Jul 2023 16:02 IST

‘నాయకుడు’ వచ్చేశాడు

దయనిధి స్టాలిన్‌, వడివేలు, ఫహద్‌ ఫాజిల్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో మారి సెల్వరాజ్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘మామన్నన్‌’. ‘నాయకుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జులై 27 నుంచి తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.


ఐటీ కంపెనీలో జరిగిన హత్య కేసును ఛేదించే క్రమంలో పోలీసు అధికారులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘పోలీస్‌ స్టోరీ: కేస్‌ 1’. తెలుగు ఓటీటీ వేదిక ‘ఈటీవీ విన్‌’ (ETV Win)లో ఈ నెల 28న (Police Story) సినిమా విడుదల కానుంది. శ్రీనాథ్‌ మాగంటి, శ్వేతా అవస్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి రామ్‌ విఘ్నేశ్ దర్శకత్వం వహించారు. రజనీకాంత్‌తో ‘బాషా’ సినిమా తెరకెక్కించిన దర్శకుడు సురేశ్‌ కృష్ణ దీనికి నిర్మాతగా వ్యవహరించారు.


నవ్వులు పంచేందుకు సిద్ధం

చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్న మూవీ ‘సామజవరగమన’ (samajavaragamana). శ్రీవిష్ణు కథానాయకుడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. వినోదాత్మక చిత్రంగా అలరించిన ఇది ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్‌ కానుంది. జులై 28 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నరేష్, వెన్నెల కిశోర్, రాజీవ్ కనకాల ఇందులో కీలకపాత్రలు పోషించారు.


సడెన్‌గా వచ్చేసిన  'స్పై'

నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'స్పై' (Spy). ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఐశ్వర్య మేనన్ (Iswarya Menon) కథానాయిక. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడీ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. (spy movie in ott) ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నేటి (జులై27) నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 


వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • పారడైజ్‌ (హాలీవుడ్) జులై 27
  • హిడెన్‌ స్ట్రైక్‌ (హాలీవుడ్) జులై 27
  • హ్యాపీనెస్‌ ఫర్‌ బిగినెర్స్‌ (హాలీవుడ్‌) జులై 27
  • ది విచ్చర్‌ సీజన్‌3-పార్ట్‌-2: (వెబ్‌సిరీస్‌) జులై 27
  • ఎ పర్‌ఫెక్ట్‌ స్టోరీ (స్పానిష్‌) జులై 28
  • కెప్టెన్‌ ఫెయిల్‌ (ఇంగ్లీష్‌) జులై 28
  • హౌ టు బికమ్‌ ఎ కల్ట్‌ లీడర్‌ జులై 28

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • రెజీనా (తమిళ్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.


డిస్నీ +హాట్‌స్టార్‌

  • ఆషిఖానా (హిందీ సిరీస్‌) జులై 24

సోనీ లివ్‌

  • ట్విస్టెడ్‌ మెటల్‌ (వెబ్‌సిరీస్‌) జులై 28

బుక్‌ మై షో

  • జస్టిస్‌ లీగ్‌: వార్‌ వరల్డ్‌ (యానిమేషన్‌ మూవీ) జులై 23
  • ట్రాన్స్‌ఫార్మర్స్‌:రైజ్‌ ఆఫ్‌ ది బీస్ట్స్‌ (హాలీవుడ్‌) జులై 26
  • ద ఫ్లాష్‌ (హాలీవుడ్‌) జులై 27

అమెజాన్‌ మినీ

  • హాఫ్‌ సీఏ (హిందీ) జులై 26

జియో సినిమా

  • లయనెస్‌ (హాలీవుడ్‌) జులై 23

  • కాల్‌కూట్‌ (హిందీ) జులై 27

మనోరమా మ్యాక్స్‌

  • కొళ్ల (మలయాళం) జులై 27
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని