మూడో మీటింగ్‌లోనే ఆ దర్శకుడు నాపై లైంగిక దాడికి తెగబడ్డాడు: ‘ఊసరవెల్లి’ నటి
‘మీటూ’ వేదికగా అనురాగ్ కశ్యప్(Anurag Kashyap)ను ఉద్దేశిస్తూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన నటి పాయల్ మరోసారి ఆయనపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన మంచి వాడు కాదని పేర్కొంది.
ముంబయి: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది ‘ఊసరవెల్లి’ నటి పాయల్ ఘోష్ (Payal Ghosh). ‘మీటూ’ వేదికగా ఇప్పటికే పలుమార్లు ఆయనపై ఆరోపణలు చేసిన ఈ నటి.. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమాలో ఛాన్స్ కోసం కలిసినప్పుడు అతడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. ఇలాంటి వాళ్లకు బాలీవుడ్‌లో ఇంకా పని దొరుకుతుండటం బాధాకరమంది.
‘‘గతంలో నేను దక్షిణాది చిత్రాల్లో నటించా. జాతీయ అవార్డులు పొందిన ఇద్దరు డైరెక్టర్స్ సినిమాల్లో పనిచేశా. ఆ ఇద్దరూ నాకెంతో గౌరవం ఇచ్చారు. ఇబ్బందిపెట్టేలా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇక, బాలీవుడ్ విషయానికి వస్తే దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో నేను అస్సలు పనిచేయలేదు. కానీ, అతడు నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మూడో మీటింగ్‌లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు చెప్పండి దక్షిణాది గురించి నేను గొప్పగా ఎందుకు చెప్పకూడదు’’ అని పాయల్ ప్రశ్నించింది. అనంతరం ఆమె ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ.. ఆయన ఎంతోమంచి వాడని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) మంచి వాడు కాదంటూ సుమారు మూడేళ్ల క్రితం పాయల్ మొదటిసారి ట్వీట్ చేసింది. ఆయన్ని తాను ఎంతో నమ్మానని.. సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి ఇంటికి పిలిచి.. తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. మరోవైపు అనురాగ్ కశ్యప్‌పై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఈ కేసులో దర్యాప్తు జరుగుతుందని ఇంకా ఏమీ తేలలేదని.. ఇదంతా డబ్బుతో కూడుకున్న వ్యవహారమని ఆమె తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత.. తెదేపా ఎమ్మెల్యేలపై దాడి!
-
Sports News
Surya Kumar Yadav: ‘సూర్య’ ప్రతాపం టీ20లకేనా?.. SKYని డీకోడ్ చేసేశారా?
-
Movies News
Telugu Movies: ఉగాది స్పెషల్.. ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
-
World News
PM Modi: మోదీ అసాధారణ నేత.. చైనాలో భారీగా ఆదరణ