Priyanka Chopra: సర్జరీ తర్వాత అద్దంలో చూసుకొని భయపడ్డా..: ప్రియాంక చోప్రా
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గతంలో తన ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్లు తెలిపింది. అయితే ఆ సర్జరీ తర్వాత అద్దంలో చూసుకొని భయపడినట్లు చెప్పింది.
హైదరాబాద్: తెరపై అందంగా కనిపించడం కోసం నటీనటులు ఎంతో కష్టపడతారు. ఆహార నియమాల దగ్గర నుంచి అవసరమైన శస్త్రచికిత్సల వరకూ అన్ని చేయించుకుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన సర్జరీ వార్త ప్రస్తుతం వైరలవుతోంది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గతంలో తన ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆమె ఆటోబయోగ్రఫిలో రాసింది. ఇటీవల ఈ విషయాన్ని ఆమె గుర్తుచేసుకుంది.
‘‘నా ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాత దాని ఆకారం పూర్తిగా మారిపోయింది. బ్యాండేజ్ తీయగానే నేను, మా అమ్మ భయపడిపోయాం. నా ముఖం మరోలా కనిపించింది. అద్దంలో చూసినప్పుడు ఎవరినో చూస్తోన్న భావన కలిగేది. ఎంతో నిరాశకు గురయ్యాను. తిరిగి మాములు స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. అసలు కోలుకుంటానని అనుకోలేదు’’ అని ప్రియాంక చోప్రా తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చింది. ఇక 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్‌గా కిరీటాన్ని ప్రియాంక సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి