Pushpa: రష్యాలోనూ ‘తగ్గేదేలే’.. 25 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Pushpa: రష్యాలో విడుదలైన ‘పుష్ప-1’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: ‘పుష్ప (Pushpa) అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు’ అంటూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాస్ హిస్టీరియా క్రియేట్ చేశారు అల్లు అర్జున్ (Allu arjun). ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా అదరగొట్టింది. ఇటీవల ఈ చిత్రాన్ని రష్యాలోనూ విడుదల చేశారు. చిత్ర బృందం సైతం అక్కడకు వెళ్లి ప్రచారం చేసింది.
సినీ ట్రేడింగ్ వర్గాల అంచనా ప్రకారం.. అక్కడ కూడా ‘పుష్ప’ పార్ట్-1 మంచి వసూళ్లు రాబడుతోంది. 25 రోజుల్లో ఈ చిత్రం 10 మిలియన్ రుబెల్స్ను వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.13కోట్లు. ఇప్పటికీ రష్యన్ భాషలో 774 స్క్రీన్స్‌పై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు భారతీయ చిత్రాలు విదేశాల్లోనూ వసూళ్లు రాబడుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పుడు ‘పుష్ప: ది రైజ్’ వచ్చి చేరింది. పుష్పరాజ్ అనే యువకుడు ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించి ఎర్ర చందనం సిండికేట్ నడిపే స్థాయికి ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా దాటాడు? అన్నది ‘పార్ట్-1’లో చూపించారు. ఎర్రచందనం సిండికేట్ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత పుష్పరాజ్ ఎవరిని ఎదుర్కోవాల్సి వచ్చింది? శత్రువులను అణగదొక్కి తన ‘బ్రాండ్’ ఇమేజ్ను ఎలా పెంచాడు? తెలియాలంటే ‘పుష్ప: ది రూల్’ చూడాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. కీలక సన్నివేశాల కోసం చిత్ర బృందం ఇటీవల థాయిలాండ్ వెళ్లింది. అల్లు అర్జున్ సరసన రష్మిక (Rashmika) నటిస్తుండగా, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
అన్నట్లు పుష్ప గురించి ఈ రికార్డులు మీకు తెలుసా?
🪓 ‘శ్రీవల్లి’, ‘ఊ అంటావా మావ’, ‘సామి సామి’ పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 2022లో అత్యంత ప్రజాదరణ కలిగిన టాప్-10 సాంగ్స్‌లో ఇవి నిలిచాయి. అంతేకాదు, 6 బిలియన్ + వ్యూస్ సొంతం చేసుకున్న తొలి ఇండియన్ ఆల్బమ్‌గానూ పాటలు రికార్డు సృష్టించాయి.
🪓 డిసెంబరు 17న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘పుష్ప’ (Pushpa) ప్రపంచవ్యాప్తంగా రూ.365కోట్లు(గ్రాస్) వసూలు చేసింది, ఒక్క హిందీలోనే రూ.108 కోట్లు (నెట్) కలెక్షన్లు రాబట్టడం విశేషం. 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పుష్ప’రాజ్ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్లో అత్యధికమంది వీక్షించిన, లైక్ చేసిన వీడియో ‘పుష్ప’టీజర్ నిలిచింది.
🪓 ఓటీటీలోనూ ‘పుష్ప’ (Pushpa) అదరగొట్టింది. 2022లో అమెజాన్ప్రైమ్ వీడియోలో అత్యధికమంది వీక్షించిన మూవీగా నిలిచింది. టెలివిజన్‌లోనూ పుష్పరాజ్ హవా చూపించాడు. 2022లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప (Pushpa) అలరించింది. 10మిలియన్+ ఇన్‌స్టా రీల్స్ క్రియేట్ చేశారంటే పుష్ప మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.