Bheemla Nayak: థియేటర్ల వద్ద పవన్‌ అభిమానుల హంగామా

రానా, పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలారోజుల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో...

Published : 25 Feb 2022 12:26 IST

హైదరాబాద్‌: రానా, పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలారోజుల తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నటించడం, పవన్‌-రానా కలిసి మొదటిసారి పోటీ పడటం, త్రివిక్రమ్‌ మాటలు.. ఇలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పటికే సూపర్‌హిట్‌ టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాలతోపాటు విదేశాల్లో సైతం థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు కట్టి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసులు పేలుస్తూ.. తీన్మార్‌ స్టెప్పులేస్తున్నారు. ‘స్టార్‌ స్టార్‌ పవర్‌స్టార్‌’, ‘బాబులకే బాబు మన కల్యాణ్‌ బాబు’ అంటూ కేకలు వేస్తున్నారు. పవన్‌ అభిమానుల హంగామాకు సంబంధించిన పలు వీడియోలివే..!












Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని