Radhika Madan: రాధికకి అరుదైన అవకాశం

‘అంగ్రేజీ మీడియం’, ‘మోనికా.. ఓ మై డార్లింగ్‌’ చిత్రాల నటి రాధికా మదన్‌ అరుదైన గౌరవం అందుకుంది.

Updated : 06 Nov 2023 13:39 IST

‘అంగ్రేజీ మీడియం’, ‘మోనికా.. ఓ మై డార్లింగ్‌’ చిత్రాల నటి రాధికా మదన్‌ అరుదైన గౌరవం అందుకుంది. ఆమె ప్రతిష్ఠాత్మక టాలిన్‌ బ్లాక్‌నైట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ న్యాయనిర్ణేతల బృందంలో సభ్యురాలిగా ఎంపికైంది. నికోలస్‌ సెలిస్‌ లోపెజ్‌, డయానా ఇలియాజే, ర్యాన్‌ హ్యాంగ్‌లాంటి పలువు అంతర్జాతీయ నటీనటులు ఈ జ్యూరీలో సభ్యులుగా ఉన్నారు. ఈ అరుదైన అవకాశం పొందిన తొలి భారతీయ నటి రాధికనే. ఎస్తోనియాలోని టాలిన్‌ నగరంలో నవంబరు 3 నుంచి 18వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన సినిమాల్ని ప్రదర్శిస్తారు. ‘ఈ ప్రఖ్యాత వేడుకలో ఒక న్యాయనిర్ణేతగా ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అంతర్జాతీయ సినీ ప్రముఖులతో కలిసి పని చేయడం నాకు ఒక మర్చిపోలేని అనుభవంగా మిగలనుంది’ అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు