Rajinikanth: ‘అర్థమైందా రాజా..’ 70 ఏళ్ల వయసులోనూ రజనీ మాటల తూటాలు..!

‘జైలర్‌’ మూవీ ఆడియో విడుదల వేడుక సందర్భంగా రజనీకాంత్‌ స్పీచ్‌లోని సంభాషణలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Published : 09 Aug 2023 02:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ (Rajinikanth).. ఈ పేరు చాలు థియేటర్లు హౌస్‌ఫుల్‌ అవుతాయి. కలెక్షన్లు వెల్లువలా వచ్చిపడతాయి. అందుకే ఆయన సినిమా వస్తుందంటే, అభిమానులే కాదు, భాషలకు అతీతంగా సినీ ప్రియులు వేచి చూస్తారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘జైలర్‌’ (Jailer). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో విడుదల వేడుక చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీ స్పీచ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. వేదికపై ఆయన మాటలు, హావభావాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాయి. 

రజనీ మేనియా.. బెంగళూరు, చెన్నైలలో పలు ఆఫీస్‌లకు సెలవు

‘‘మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా..’’అంటూ ఈ  సందర్భంగా తన జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరిస్తూ పలికిన మాటలకు అభిమానుల కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అలాగే దుర్యోధనుడి పాత్ర గురించి హావభావాలు పలికిస్తూ చెప్పిన డైలాగ్‌ కూడా చప్పట్లు కొట్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రజనీ తమిళంలో మాట్లాడుతున్నా, ఆ మాటలు వింటుంటే గూస్‌బంప్స్‌ వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.

ఇక ‘జైలర్‌’ చిత్రంలో మోహన్‌లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, తమన్నా, రమ్యకృష్ణ, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. తమన్నా ఆడి పాడిన ‘కావాలయ్యా’పాట ఇప్పటికే యూట్యూబ్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని