Avatar2: ‘అవతార్‌2’ను సినిమా అంటే నేరం..: రామ్‌గోపాల్‌ వర్మ

అవతార్‌2(Avatar The Way Of Water) చూసిన రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో దానిపై ట్విట్‌ చేశారు. అవతార్‌ను సినిమా అంటే నేరం అవుతుందని పేర్కొన్నారు.

Published : 17 Dec 2022 01:51 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ అవతార్‌2(Avatar The Way Of Water) సినిమా అన్ని ధియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకొని ప్రేక్షకులను మరో లోకంలో విహరింపచేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన వాళ్లందరూ సోషల్‌ మీడియా వేదికగా వాళ్ల స్పందనని తెలియచేస్తున్నారు. అవతార్‌ చూసిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ(Ram Gopal Varma) ట్విటర్‌ వేదికగా సినిమా గురించి నెటిజన్లతో పంచుకున్నారు. ఏ విషయం గురించైనా తనదైన స్టైల్‌లో అభిప్రాయాన్ని తెలిపే వర్మ అవతార్‌ రివ్యూలో కూడా తన మార్క్‌ చూపించారు.

‘ఇప్పుడే అవతార్2లో స్నానం చేసి వచ్చాను. దీనిని సినిమా అనడం నేరంతో సమానం. ఎందుకంటే అద్భుతమైన విజువల్స్‌తో అబ్బురపరిచే యాక్షన్‌తో జీవితకాలానికి సరిపోయే అనుభూతిని అందించింది అవతార్‌. మరోలోకంలో విహరించినట్లు ఉంది’ అని వర్మ ట్విట్‌ చేశారు. ఇక అవతార్‌ మొదటి భాగంలో పండారా గ్రహంలో ఊరేగించిన జేమ్స్‌ కామెరూన్(James Cameron)‌.. రెండో భాగంలో ప్రేక్షకులను సముద్ర గర్భంలోకి తీసుకెళ్లారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని