అందుకే నీలాంబరి పాత్ర చేయకూడదనుకున్నా!!

రమ్యకృష్ణను శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా మార్చిన చిత్రం ‘నరసింహా’. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె గతంలో పంచుకున్నారిలా..!

Published : 02 Nov 2022 14:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అప్పటి వరకు కథానాయికగా ఓ వెలుగు వెలిగిన రమ్యకృష్ణను.. శక్తిమంతమైన మహిళా పాత్రలకు చిరునామాగా మార్చిన చిత్రం ‘నరసింహా’. ఈ సినిమాతోనే ఆమె స్టార్‌డమ్‌ అమాంతం పెరిగింది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ప్రతినాయకురాలిగా నీలాంబరి పాత్రలో ఆమె కనబర్చిన నటన సినీ ప్రియులతో పాటు విమర్శకులను మెప్పించింది. అయితే ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఓ సందర్భంలో రమ్యకృష్ణ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

‘‘నరసింహా’లోని నీలాంబరి పాత్రను చేయడం మొదట్లో నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు తల పొగరు ఎక్కువగా ఉన్నట్లు ఆ పాత్రను తీర్చిదిద్దారు. అయితే అది కేవలం సినిమాలోని పాత్రే అని నాకు తెలుసు. కానీ, దర్శకుడు ‘నీకు నీలాంబరి పాత్ర కావాలా? సౌందర్య పాత్ర కావాలా?’ అని అడిగి ఉంటే సౌందర్య పాత్రే కావాలని చెప్పేదాన్ని. కానీ, అది జరగలేదు. ఈ చిత్రంలో నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను. కానీ, దర్శకుడి విజన్‌ను నమ్మా కాబట్టి ఆ పాత్రను అంత బాగా చేయగలిగా’’ అని చెప్పుకొచ్చింది. ఇటీవల ‘లైగర్‌’ చిత్రంలో విజయ్‌ దేవరకొండ తల్లి పాత్రల్లో రమ్యకృష్ణ నటించిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని