Ranbir Kapoor: అలియా పక్కన నేను బాగుండనేమో.. రణ్‌బీర్‌ కపూర్‌ కామెంట్స్‌!

అలియాభట్‌ పక్కన నేను, నా పక్కన అలియా ఉండే చూసేందుకు అంతగా బావుండదేమో, ఎత్తు సమస్య వల్ల అలా అనిపించొచ్చు అంటున్నారు అలియా భర్త, బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌. ఈ మాట ఆయనతో ఆయనే చెప్పుకున్నారు.

Published : 11 Jul 2022 23:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలియాభట్‌ పక్కన నేను, నా పక్కన అలియా.. చూసేందుకు అంతగా బాగుండదేమో, ఎత్తు సమస్య వల్ల అలా అనిపించొచ్చు అంటున్నారు ఆమె (Alia Bhatt) భర్త, బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor). సీరియస్‌గా కాదండోయ్‌ ఈ సరదా వ్యాఖ్యను ఆయనపై ఆయనే చేసుకున్నారు. అదెలా అంటారా? రణ్‌బీర్‌ ‘షంషేరా’ (Shamshera) అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా జులై 22న విడుదలకాబోతుంది. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టే ‘డ్యుయల్‌ రోల్‌’ ప్రచారంలో పాల్గొన్నారు. ‘ది అదర్‌ కపూర్‌ షో’ (The Other Kapur Show) అనే ఫన్నీ వీడియోలో హోస్ట్‌గా, గెస్ట్‌గా రణ్‌బీర్‌ సందడి చేశారు. ఇప్పటి వరకూ నటించిన తన సినిమాలపై తానే సెటైర్లు వేసుకుని, కామెడీ పండించారు.

* ‘‘పృథ్వీరాజ్‌ కపూర్‌, రాజ్‌ కపూర్‌, రిషి కపూర్‌.. ఓ లెగసీ ఫ్యామిలీ నుంచి రావడం ఎలా అనిపిస్తుంది?’ అని హోస్ట్‌ స్థానంలో ఉన్న రణ్‌బీర్‌ అడగ్గా.. గెస్ట్‌ రణ్‌బీర్‌ తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈలోపే ‘వారందరినీ నిరుత్సాహపరిచినందుకు’ అంటూ హోస్ట్‌ కౌంటర్‌ వేస్తారు.

* సినిమాల విషయంలోనూ ఇలాంటి సెటైర్లు వేశారు. ‘‘బర్ఫీ’, ‘జగ్గా జసూస్‌’, ‘సంజు’ సినిమాల్లోని హీరో పాత్రలు వేరే చిత్రాల్లోనివి, నిన్ను కాపీక్యాట్‌ అనొచ్చు’’ అని హోస్ట్‌ కామెంట్‌ చేయగా ‘‘ఓకే.. మరి ‘బేషరమ్’ సంగతేంటి?’’ అంటూ గెస్ట్‌ అడుగుతారు. ఈ క్రమంలో హోస్ట్‌ ఇచ్చిన పంచ్‌కు గెస్ట్‌ ఏం మాట్లాడలేకపోతారు.

* అనంతరం, వ్యక్తిగత విషయాల్లో భాగంగా అలియా ప్రస్తావన వస్తుంది. ‘‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రంతో అలియా బ్లాక్‌ బస్టర్ హిట్‌ అందుకుంది. నువ్వు అసూయపడుతున్నావా’’ అంటూ హోస్ట్‌ రణ్‌బీర్‌ ఆటపట్టించగా ‘‘నేను ఆమెను పెళ్లిచేసుకున్నందుకు నువ్వు అసూయపడుతున్నట్టున్నావ్‌’’ అని గెస్ట్‌ వాపోతారు. ‘‘నాకెందుకు అసూయ? హైట్‌ డిఫరెన్స్‌ వల్ల ఆమె నాకు సరైన జోడీ అని నేను అనుకోవట్లేదు’’ అంటూ హోస్ట్‌ వివరిస్తారు.

* ‘‘అంటే మేమిద్దరం జంటగా బాగుండమనుకుంటున్నారా?’’ అంటూ గెస్ట్‌ ప్రశ్నిస్తారు. ‘‘లేదు.. ఆమె పక్కన నేను బాగుండనని చెప్పా’’ అని హోస్ట్‌ అంటారు. ‘‘మనమిద్దరం ఒకేలా ఉన్నాం. అంటే నా పక్కన తను బాగుండదనేగా మీ ఉద్దేశం’’ అంటూ గెస్ట్‌ తన మనసులో మాట బయటపెడతారు.

*  ‘షంషేరా’ చిత్రాన్ని పీరియాడికల్‌ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో కరణ్‌ మల్హోత్రా తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ 1800 కాలం నాటి స్వాతంత్య్రకాంక్ష కలిగిన, దోపిడి ముఠా నాయకుడిగా కనిపించనున్నారు. ఇందులో ఆయన తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారు. వాణీకపూర్‌, సంజయ్‌దత్‌ కీలక పాత్రలు పోషించారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని