SSMB28: మహేశ్‌ - త్రివిక్రమ్ సినిమాలో రష్మిక సాంగ్‌..!

మహేశ్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

Published : 29 Nov 2022 19:36 IST

హైదరాబాద్‌: సినిమాల్లోని ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేకంగా అభిమానులు ఉంటారు. ఏ చిత్రంలో అయినా ఇలా స్పెషల్‌ సాంగ్‌ ఉంటే ఆ క్రేజే వేరు. అందుకే దర్శక-నిర్మాతలు కూడా ఐటెం సాంగ్‌పై ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో ఈ పాటలకు హీరోయిన్స్‌ వేరుగా ఉండేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్‌ మారింది. ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉన్న భామలే ఐటెం సాంగ్స్‌లోనూ కాలు కదుపుతున్నారు. ఇలా టాప్‌ హీరోయిన్స్‌ చేస్తే ఆ సినిమాకు డబుల్‌ క్రేజ్‌ వస్తుంది. శ్రేయ దగ్గరి నుంచి ఇటీవల సమంత వరకు సినిమాల్లో సింగిల్‌ సాంగ్స్‌తో అలరించారు.  వీరి జాబితాలోకి నేషనల్‌ క్రష్‌ చేరనుందని లేటెస్ట్‌ టాక్‌.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేశ్‌ బాబు కథానాయకుడిగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. రష్మిక ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఈ చిత్రంలోని ఐటెం సాంగ్‌ను ఓ బాలీవుడ్‌ బ్యూటీతో చేయించనున్నారనే రూమర్స్‌ వచ్చాయి. బాలీవుడ్‌ హీరోయిన్‌ స్థానంలో రష్మికను తీసుకున్నట్లు సమాచారం. త్రివిక్రమ్‌ సినిమాల్లో ఇప్పటి వరకు ఐటెం సాంగ్స్‌ లేవు. మొదటిసారి ఈ చిత్రంలో పెట్టనున్నారని టాక్‌. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. #SSMB28గా ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజాహెగ్డే (Pooja Hegde) నటిస్తోంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రూపుదిద్దుకోనుంది. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని