Ravanasura: ‘రావణాసుర’తో నా కల నెరవేరింది
‘‘కథానాయకుడు రవితేజకి నేను అభిమానిని. ఆయన సినిమాకి పని చేసే అవకాశం రాగానే నా కల నెరవేరిన అనుభూతి కలిగింది’’ అన్నారు హర్షవర్ధన్ రామేశ్వర్.
‘‘కథానాయకుడు రవితేజకి నేను అభిమానిని. ఆయన సినిమాకి పని చేసే అవకాశం రాగానే నా కల నెరవేరిన అనుభూతి కలిగింది’’ అన్నారు హర్షవర్ధన్ రామేశ్వర్. సరికొత్త బాణీతో తెలుగు సినిమాని ప్రభావితం చేస్తున్న నవతరం సంగీత దర్శకుల్లో ఆయన ఒకరు. ‘అర్జున్‌రెడ్డి’తో ఆయన పేరు ప్రత్యేకంగా వినిపించింది. ఆ సినిమా రీమేక్ ‘కబీర్‌సింగ్’తో బాలీవుడ్‌కి కూడా పరిచయం అయ్యారు. ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న ‘రావణాసుర’ స్వరకర్త ఆయనే. చిత్రం ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా హర్షవర్ధన్ రామేశ్వర్ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘నేను పనిచేసిన మరో ప్రత్యేకమైన సినిమా ఇది. రవితేజ - సుధీర్‌వర్మ శైలి మాస్, థ్రిల్లింగ్ అంశాలున్న ఈ తరహా కథకి ఇదివరకు పనిచేయలేదు. దర్శకుడు సుధీర్‌వర్మ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. ఆయన సినిమాల్లో కొత్త రకమైన సౌండింగ్ వినిపిస్తుంటుంది. అందుకు తగ్గట్టుగానే ‘రావణాసుర’ ఉంటుంది. ఈ సినిమాకి నేను నాలుగు పాటలతోపాటు, నేపథ్య సంగీతం సమకూర్చారు. భీమ్స్ ఓ ప్రత్యేక గీతం చేశారు. ఈ సినిమా ప్రయాణం ఓ కొత్త రకమైన సవాల్‌నిచ్చింది’’.
* ‘‘కథానాయకుడు రవితేజతో పనిచేయడం మంచి అనుభవం. ఆయన ప్రోత్సాహం ఎంత బాగుంటుందో, ఆయన ఇచ్చే సలహాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. ‘వెయ్యిన్నొక్క జిల్లాల వరకు...’ పాటని రీమిక్స్ చేసిన ఆయన దగ్గరికి తీసుకెళ్లినప్పుడు స్ట్రింగ్ వాయిద్యం కంటే ఇక్కడ విజిల్ సౌండ్ పెడితే బాగుంటుందని చెప్పారు. నిజంగా ఆ విజిల్ సౌండ్ పాటపై చాలా ప్రభావం చూపించింది’’.
* ‘నా కెరీర్‌లో ‘అర్జున్‌రెడ్డి’ తొలి సినిమానే కాదు. నాకి అదొక మైలురాయి. ఇప్పటిదాకా నాకు అవకాశాల్ని తెచ్చిపెట్టింది ఆ సినిమానే. ‘రావణాసుర’ ఇప్పుడు నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందని నమ్ముతున్నా. రిథమ్ ప్లేయర్‌గా కెరీర్ మొదలుపెట్టాను. తర్వాత ప్రోగ్రామింగ్ చేశా. కన్నడలో హరికృష్ణ మొదలుకొని జిబ్రాన్, రథన్, దేవా... ఇలా చాలా మంది దగ్గర పనిచేశా. ఒకొక్కరిదీ ఒక్కో శైలి. వాళ్లందరి ప్రభావం నాపైన ఉంటుంది. సందీప్‌రెడ్డి వంగాతో ‘అర్జున్‌రెడ్డి’ నుంచి ప్రయాణం చేస్తున్నా. ఇప్పుడు ఆయన ‘యానిమల్’ సినిమాకీ పనిచేస్తున్నా. అది మరో సంచలనం అవుతుంది. హిందీలో అయినా, ఇక్కడ అయినా పని చేయడంలో తేడా ఏమీ ఉండదు’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Navy: భారత నేవీ మరో ఘనత.. నీటిలోని లక్ష్యాన్ని ఛేదించిన స్వదేశీ టార్పిడో
-
Movies News
Virupaksha: ‘విరూపాక్ష’ మీమ్స్.. ఈ వైరల్ వీడియోలు చూస్తే నవ్వాగదు!
-
Ts-top-news News
Guntur: మృతుని పేరు మీద 12 ఏళ్లుగా పింఛను
-
Movies News
Prabhas: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్, ‘ఆదిపురుష్’ టీమ్
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
TSLPRB: తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం