Raviteja: రవితేజ కుటుంబం నుంచి కొత్త హీరో

కథానాయకుడు రవితేజ (Raviteja) కుటుంబం నుంచి మరో హీరో తెరకు పరిచయమవుతున్నారు. ఆయన తమ్ముడు రఘు తనయుడు మాధవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకురాలు గౌరీ రోణంకి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Updated : 24 Mar 2023 07:05 IST

కథానాయకుడు రవితేజ (Raviteja) కుటుంబం నుంచి మరో హీరో తెరకు పరిచయమవుతున్నారు. ఆయన తమ్ముడు రఘు తనయుడు మాధవ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. దర్శకురాలు గౌరీ రోణంకి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. జేజేఆర్‌ రవిచంద్‌ నిర్మాత. ఈ చిత్రం హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్‌ కొట్టి.. దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ అందించారు. డి.సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో మాధవ్‌ మాట్లాడుతూ.. ‘‘నాకీ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. వచ్చే నెల నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది. మాకు మీ అందరి ప్రోత్సాహం కావాలి’’ అన్నారు. ‘‘ఇది నా రెండో చిత్రం. చాలా యూత్‌ ఫుల్‌గా ఉంటుంది’’ అన్నారు దర్శకురాలు గౌరీ. నిర్మాత జె.జె.ఆర్‌.రవిచంద్‌ మాట్లాడుతూ.. ‘‘రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మంచి కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో అన్ని విభాగాలు హైలైట్‌ కానున్నాయి. త్వరలో ఇతర నటీనటుల వివరాల్ని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్‌, చదలవాడ శ్రీనివాసరావు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని