RGV: అమ్మాయిలపై దాడి.. వర్మ ఆగ్రహం

బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారన్న ఆగ్రహంతో ఇద్దరు గిరిజన అక్కాచెల్లెళ్లను సొంత కుటుంబసభ్యులే కర్రలతో చితకబాదిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ దర్శకుడు...

Updated : 05 Jul 2021 13:58 IST

మధ్యప్రదేశ్‌ ఘటనపై ఆర్జీవీ ట్వీట్‌

హైదరాబాద్‌: బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారన్న ఆగ్రహంతో మధ్యప్రదేశ్‌లో ఇద్దరు గిరిజన అక్కాచెల్లెళ్లను సొంత కుటుంబసభ్యులే కర్రలతో చితకబాదిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని తాను నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లందరికీ తగిన శిక్ష వేయకపోతే.. తనకు ఈ దేశంపై ఉన్న నమ్మకం పోతుందని అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన గిరిజన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కుమారులతో కొంతకాలం నుంచి ఫోన్‌లో మాట్లాడుతున్నారు. దీంతో ఆగ్రహానికిలోనైన కుటుంబసభ్యులు జూన్‌ 22న వాళ్లపై దాడికి పాల్పడ్డారు. వాళ్లిద్దర్నీ జుట్టు పట్టి ఈడుస్తూ కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దాంతో పోలీసులు ఈ ఘటనపై దృష్టి సారించి మొత్తం ఏడుగురిని అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని