RRR: జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా ఇప్పటికే సంచలనం సృష్టించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. తాజాగా పది లక్షలమందికిపైగా ప్రేక్షకులకు చేరువైన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.

Updated : 05 Apr 2023 06:57 IST

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా ఇప్పటికే సంచలనం సృష్టించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. తాజాగా పది లక్షలమందికిపైగా ప్రేక్షకులకు చేరువైన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌(Ram Charan) ప్రధాన పాత్రధారులుగా అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని ‘నాటునాటు...’ సాంగ్‌ ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ అవార్డు సైతం గెల్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబరులో జపాన్‌లో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిరాటంకంగా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్‌ తెరలపై ఈ చిత్రం ప్రదర్శితమవుతోంది. ‘జాపనీస్‌ అభిమానుల నుంచి మాకు మిలియన్‌ ప్రేమపూర్వక కౌగిలింతలు అందాయి. మీ అభిమానానికి కృతజ్ఞతలు’ అని ఈ మైలురాయి చేరుకోవడంపై మంగళవారం రాజమౌళి సైతం స్పందించారు. బాక్సాఫీస్‌ అంచనాల ప్రకారం.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జపాన్‌లో ఇప్పటికే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని