Published : 07 Jun 2022 16:07 IST

RRR: ‘బాహుబలి 2’ వర్సెస్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యాక్షన్‌ .. వావ్‌ అనిపించే ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బాహుబలి 2’ (Baahubali), ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR).. తెలుగులో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చిత్రాలివి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డులు సృష్టించాయి. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (హిందీ వెర్షన్‌) ఇటీవల ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అత్యధిక వ్యూస్‌ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఇంకా మరింత మందికి చేరువ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ విభిన్న రకాలుగా ప్రచారం చేస్తోంది. ఈ మేరకు.. ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్‌ సీన్‌, నాటు నాటు పాటకు సంబంధించిన సన్నివేశాన్ని కొన్ని రోజుల క్రితమే విడుదల చేసింది. ఎన్టీఆర్‌ ఎంట్రీ సీన్‌తోపాటు ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలను ‘బాహుబలి 2’లోని పోరాట దృశ్యాలతో ముడిపెట్టి రూపొందించిన వీడియోలను నెట్‌ఫ్లిక్స్‌ ఇటీవల రిలీజ్ చేసింది. ఈ రెండు యాక్షన్‌ వీడియోలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఆసక్తికర వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి..



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని