Sai Dharam Tej: ఈరోజు వాలెంటైన్స్ డే.. మరి రేపు: సాయిధరమ్‌ తేజ్‌ ఆసక్తికర పోస్ట్‌

ప్రేమికుల రోజు సందర్భంగా సాయి ధరమ్‌ తేజ్‌ పెట్టిన పోస్ట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అదేంటంటే?

Published : 14 Feb 2024 21:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో తనదైన శైలిలో పోస్ట్‌లు పెట్టి, ఆకట్టుకుంటారు యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej). ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ట్వీట్‌ నెటిజన్లకు నవ్వులు పంచుతోంది. సింగిల్స్‌కు బాగా కనెక్ట్‌ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ‘‘ఇవాళ వాలెంటైన్స్‌ డేనట.. మరి రేపు? అందుకే ప్రతిరోజూ స్పెషలే లేదంటే మిమ్మల్ని అభిమానించే వారితో స్పెషల్‌గా మార్చుకోండి. స్మైల్‌’’ అంటూ తన స్టిల్‌ పంచుకున్నారు. చెప్పినట్లుగానే అందులో ఆయన నవ్వుతూ కనిపించారు. #HappyValentinesDay హ్యాష్‌ట్యాగ్‌కు బదులు #HappyEveryDay జోడించారు. క్షణాల్లోనే ఈ పోస్ట్‌కు వేల లైక్స్‌, వందల రీట్వీట్లు, కామెంట్లు వచ్చాయి. దీనిపై నటి శ్రియా రెడ్డి స్పందిస్తూ ‘మీరు చెప్పింది నిజం’ అని రిప్లై ఇచ్చారు. ‘ఈరోజు నాకు వర్కింగ్‌ డే. రేపు కూడా’ అని ఓ నెటిజన్‌, ‘సోలో బతుకే సో బెటర్‌’ అని మరొకరు కామెంట్‌ పెట్టారు.

సినిమాల విషయానికొస్తే.. ‘విరూపాక్ష’ (Virupaksha), ‘బ్రో’ (Bro)తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం ‘గాంజా శంకర్‌’ (Gaanja Shankar)లో నటిస్తున్నారు. సంపత్‌ నంది తెరకెక్కిస్తున్న చిత్రమిది. పూర్తిస్థాయి యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న ఇందులో తేజ్‌ లుక్‌ కొత్తగా ఉండనుందని సమాచారం. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించే అవకాశాలున్నాయంటూ కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగింది. మరోవైపు, కలర్స్‌ స్వాతితో కలిసి ఈయన నటించిన ‘సత్య’ పలు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఒనిరోస్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో.. రెండు పురస్కారాలు పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని