venkatesh: సైంధవ్‌ నాకెంతో ప్రత్యేకం: వెంకటేశ్‌

‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం ‘సైంధవ్‌’. ఇదొక భావోద్వేగభరితమైన యాక్షన్‌ థ్రిల్లర్‌. సంక్రాంతి పండక్కి కుటుంబంతో కలిసి ఆనందించేలా ఉంటుంది’’ అన్నారు కథానాయకుడు వెంకటేశ్‌.

Updated : 22 Nov 2023 09:34 IST
‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం ‘సైంధవ్‌’. ఇదొక భావోద్వేగభరితమైన యాక్షన్‌ థ్రిల్లర్‌. సంక్రాంతి పండక్కి కుటుంబంతో కలిసి ఆనందించేలా ఉంటుంది’’ అన్నారు కథానాయకుడు వెంకటేశ్‌. ఆయనకిది 75వ సినిమా. శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో మంగళవారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘రాంగ్‌ యూసేజ్‌’’ అంటూ సాగే ఈ పాటకు సంతోష్‌ నారాయణన్‌ స్వరాలు సమకూర్చగా.. చంద్రబోస్‌ సాహిత్యమందించారు. నకాష్‌ అజీజ్‌ ఆలపించారు. అనంతరం వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. శైలేష్‌ అద్భుతంగా తెరకెక్కించారు. దీంట్లో యాక్షన్‌ చాలా న్యూ ఏజ్‌గా ఉంటుంది. అలాగే ఎమోషన్స్‌ అద్భుతంగా పండాయి. ఈ ‘రాంగ్‌ యూసేజ్‌’ పాటలో డబ్బు, మనుషులు, స్నేహం గురించి అర్థవంతమైన లిరిక్స్‌ ఉన్నాయి. మేము చాలా అద్భుతమైన చిత్రం చేశాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘ఒక లెజెండరీ నటుడి 75వ సినిమా ఎలా ఉండాలో.. దీన్ని అలా తీశా. ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల్లో బెస్ట్‌ ఇది’’ అన్నారు దర్శకుడు శైలేష్‌ కొలను. ఈ కార్యక్రమంలో సంతోష్‌ నారాయణన్‌, మణికందన్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని